ఏకాదశి సందర్భంగా సింహగిరిపై వైకుంఠ శోభ

అప్పన్న ఉత్తర ద్వార దర్శనం… పరవశించిన భక్తజనం: ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజానీకం ఆరాధ్యదైవం సింహాచలం సింహాద్రి అప్పన్న ఉత్తర ద్వార దర్శనంతో భక్తులను తరింపజేశారు. సింహాచలం దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు తెల్లవారుజామున ‘ నాలుగు గంటల నుండి 11 గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు’.

 శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని ఉత్తర ద్వారం ద్వారా భక్తులు దర్శించుకుని తరించారు స్టీల్ ప్లాంట్ ‘వరాహ లక్ష్మీ నరసింహ బృందం’ రాజగోపురం ముందు కోలాట ప్రదర్శన చేశారు. రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రభుత్వ ఎలమంచిలి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ స్వామిని దర్శించుకున్నారు. భక్తుల కోసం ప్రత్యేక ప్రసాదం అందించారు. దేవాలయాన్ని పూలతో అలంకరించారు.

స్వామిని దర్శించి తరించారు. సుప్రభాత సేవ అనంతరం. ఆలయ బేడా చుట్టూ, వైకుంఠవాసుని అలంకారంతో ఉభయదేవేరులతో , సర్వారంగ సుందరంగా అలంకరించిన పల్లకిపై తిరువీధి జరిపి, భక్తుల హరినమస్మరాలు మధ్య ఉత్తర ద్వారం వద్ద కు సుమారు నాలుగు గంటల సమయాన తీసుకువచ్చారు. అప్పన్నను రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస ఇతర ప్రముఖులు దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్త సంగీతావిభావారి ఏర్పాటు చేశారు. భక్తుల హరిణమస్మరణాలు, కోలాటాలతో సింహగిరి మారుమ్రోగింది. భక్తులకు ఉచిత పొంగలి ప్రసాదం దేవస్థానం అందజేసింది. ఉత్తర ద్వార దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, దేవస్థానం సిబ్బంది ఏర్పాట్లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *