ఒక చెంచా దాల్చిన చెక్క చూర్ణంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం

దాల్చిన చెక్క అనగానే బిరియాని తయారీలోనూ, మషాలా కూరలు తయారీలోనేగా దీని ప్రభావం ఉంటుందనేది అనే అభిప్రాయం అందరిలో ఉంది. కాని దానిలోనూ ఔషధ గుణాలున్నాయని కొందరికే తెలుస్తుంది. . దాల్చిన చెక్కకు సంస్కృతంలో ‘త్వక్’అనే పేరుంది. ‘దారుసితా’ (తియ్యని మాను కలిగినది అని అర్థం) అనేది కూడా దాల్చిన చెక్క పేరే.దాల్చిన చెక్క రుచిలో తీపి తగులుతూ అంతలో మంటనిపించే ఘాటు నషాళానికి అంటుతుంది. కోసం అనారోగ్య సమస్యలు నయం చేసేందుకు వంటలలో వాడుతుంటారు. యాంటీ ఆక్సిడెంట్లలో ఇది ఒకటి. దీనిలో మాంగనీసు చాలా ఎక్కవ స్ధాయిలో ఉంది. పీచు క్యాల్షియం కూడా లభిస్తాయి. రోజూ ఏ రూపంలో నైనా ఒక చెంచా దాల్చిన చెక్క పౌడర్ తీసుకుంటే ఆర్ డి ఏ విలువ ప్రకారం 22% మాంగనీస్ మనకు లభిస్తుంది.

ఉదయం దాల్చిన చెక్కను నేరుగా తీసుకోవడం మంచిది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు అధికంగా ఉంటాయి. దాల్చిన చెక్కలో ఉండే సినామిన్ డీహైడ్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాస్తవానికి ఇది అనేక వ్యాధులను నివారించడలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు ప్రభావం వల్ల ఇందులో మాంగనీస్, ఫైబర్ , క్యాల్షియంలు కూడా అధికంగా ఉంటాయి. అందుకే దీన్ని ప్రిజర్వేటివ్ ఫుడ్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. జెర్మ్స్ అండ్ బ్యాక్టీరియాను నాశనం చేయడానికి ప్రిజర్వేటివ్ ఫుడ్స్ లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

దాల్చిన చెక్కను సాధారణంగా కూరల్లో వాడడమేకాకుండా పొడి చేసుకుని నీళ్ళలో కలుపుకుని తాగితే మంచి ఫలితానిస్తుంది.

కాలేయ వ్యాధులతో భాదపడే వారు కొద్దిగా కేర్ ఫుల్ గా ఉండటం మంచిది. అయితే దీన్ని ఎవరైనా సరే పరిమితంగా తీసుకోవడం మంచిది.

1.అధిక బరువుని తగ్గిస్తుంది :

దాల్చిన చెక్క, తేనె మిశ్రమంలో ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు పోసి, బాగా మిక్స్ చేసి, ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడానికి ఒక గంట ముందు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే రాత్రి నిద్రించే ముందు కూడా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

2.తక్షణ శక్తి ని ఇస్తుంది :

ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పౌడర్ ను టీ లేదా పాలలో మిక్స్ చేసి తాగడం వల్ల ఇన్ స్టాంట్ ఎనర్జీ పొందుతారు.

3.రక్తప్రసరణని మెరుగుపరుస్తుంది:

దాల్చిన చెక్క పౌడర్ ను ఒక టీస్పూన్ తీసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

  1. గుండె జబ్బులని నివారిస్తుంది :

తేనె, దాల్చిన చెక్కను బ్రేక్ ఫాస్ట్ కి ముందు తీసుకోవడం వల్ల హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. డైరెక్ట్ తీసుకోవడం ఇష్టపడని వాళ్లు.. బ్రెడ్ పై జామ్ కి బదులు ఈ పేస్ట్ చేర్చుకుని తినడం వల్ల స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది. కొలెస్ర్టాల్ లెవెల్స్ తగ్గుతాయి. ఇప్పటికే హార్ట్ ఎటాక్ సమస్యతో బాధపడుతున్నవాళ్లు కూడా రెగ్యులర్ గా ఈ మిశ్రమాన్ని తీసుకోవం వల్ల గుండె కండరాలను బలంగా చేస్తుంది.

5.కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది :

దాల్చిన చెక్క మరియు తేనె కాంబినేషన్ ఆర్థరైటిస్ ఒక ఉత్తమ చికిత్స వంటింది. రెండు బాగాల గోరువెచ్చని నీళ్ళలో ఒక బాగం తేనె మరియు ఒక చెంచా దాల్చిన చెక్క పౌడర్ వేసి, బాగా మిక్స్ చేసి పేస్ట్ లా చేయాలి. శరీరంలో నొప్పి, వాపు ఉన్న ప్రదేశంలో అప్లై చేసి మసాజ్ చేయాలి. నొప్పి చాలా త్వరగా తగ్గుతుంది . అలాగే ఆర్థరైటిస్ పేషంట్స్ ఒక కప్పు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా దాల్చిన చెక్కపౌడర్ మిక్స్ చేసి బ్రేక్ ఫాస్ట్ కు ముందు తీసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా తీసుకుంటే క్రోనిక్ ఆర్ధరైటిస్ నివారించబడుతుంది.

6.జీర్ణశక్తి పెరుగుతుంది:

దాల్చిన చెక్క పొడిలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ప్రతి రోజూ దాల్చిన చెక్క పౌడర్ ను ఉదయం పరడగపున ఒక టీస్పూన్ తీసుకుంటే, జీర్ణశక్తి పెరుగుతుంది.

7.దగ్గు, జలుబుని తగ్గిస్తుంది :

ఒక టీస్పూన్ తేనె, చిటికెడు చెక్క పొడి తీసుకుని రెండింటినీ బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి నిద్రపోవడానికి ముందు తినాలి. అంతే.. దగ్గు, జలుబుని తేలికగా తగ్గిస్తుంది. తేనెలో నేచురల్ పదార్థాలు ఉండటం వల్ల , ఇది ఇన్ఫ్లూయాంజాకు సంబంధించన క్రిములను నాశనం చేసి, ఫ్లూ నుండి పేషంట్ ను రక్షిస్తుంది. తేనెను దాల్చిన చెక్కతో మిక్స్ చేసి తీసుకోవడం వల్ల ఇన్ఫ్లూయాంజాకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. లక్షణాలను మరియు జర్మ్స్ ను నాశనం చేస్తుంది.

గమనిక :

కాలేయ వ్యాధులతో భాదపడే వారు కొద్దిగా కేర్ ఫుల్ గా ఉండటం మంచిది. అయితే దీన్ని ఎవరైనా సరే పరిమితంగా తీసుకోవడం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *