మునగతో ఆరోగ్యానికి ఎంతో మేలు..

మన దేశానికి చెందిన మునగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నది జగమెరిగిన సత్యం. పురాతన కాలం నుంచీ దీన్ని ఆహారంలో, ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. అంత ప్రత్యేకమైన మునగలో ఎలాంటి పోషకాలున్నాయో తెలుసుకుందాం.

  • మునగ మంచి రుచికరమైన పోషకాహారం. వీటి కాయలు, విత్తనాలు, ఆకులు, బెరడు అన్నీ ఏదో రూపంలో ఉపయోగపడుతూనే ఉన్నాయి.
  • మునగలో అధిక విటమిన్లు, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
  • మునగకాయలతో పాటు, మునగాకు కూడా ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
  • ఆరెంజ్‌లో కంటే మునగాకులో అధికంగా విటమిన్ సి ఉంటుంది. పాలల్లో క్యాల్షియం, అరటిపండు ద్వారా పొటాషియం, పాలకూర ద్వారా ఐరన్ లభిస్తాయి. కానీ మునగాకు తింటే.. ఈ పోషకాలన్నీ లభిస్తాయి.
  • వీటితో పాటుగా జింక్, బీటా కెరోటిన్, విటమిన్ ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
  • కంటిచూపు సమస్యలను నివారించడంలో మునగ గొప్పగా పనిచేస్తుంది.
  • మనిషి మానసికంగా దృఢంగా ఎదగడానికి, మానసిక ఒత్తిడులు అధిగమించడానికి మునగ మంచి ఆహారం.
  • క్యాన్సర్ రాకుండా నివారించడంలో, క్యాన్సర్ కారక కణాలతో పోరాడడంలో గొప్ప సహాయకారిని.
  • మునగను ఆహారంలో భాగం చేసుకుంటే మహిళల రుతుక్రమ సమస్యలకు చెక్ చెప్పొచ్చు.
  • హెపటిక్ సంబంధిత సమస్యలను పారదోలడంలో మునగ చక్కగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *