వైఎస్సార్సీపీలోకి కేతిరెడ్డి రామాకోటా రెడ్డి తన అనుచరులతో పార్టీలో చేరిక

కోటా రెడ్డి తన అనుచరులతో కలిసి బుధవారం హైదరాబాద్లోని వైయస్సార్ పార్టీ అధ్యక్షుడు జగన్ను ఆయన నివాసంలో కలిసి పార్టీలో చేరాలని అభీష్టాన్ని వ్యక్తం చేశాను.

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో టిడిపి సీనియర్ నేత రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బావ కేతిరెడ్డి రాంకోటియారెడ్డి బుధవారం వైఎస్సార్సీపీలో చేరారు.

పార్టీ కండువా కప్పి వైయస్సార్ సిపి లోకి ఆహ్వానించారు. కోటారెడ్డి తో పాటు ఆయన ఇద్దరు కుమారులు శశిధర్ రెడ్డి, కళాధర్ రెడ్డికి కూడా జగన్ కండువా వేసి పార్టీలోకి చేర్చుకున్నారు.

రాము కోటారెడ్డి దశాబ్దలుగా టిడిపిలో ఉంటూ కావలి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర నిర్వహించారు. కావలి పట్టణ టిడిపి అధ్యక్షునిగా, సాగునీటి ఛైర్మన్ గా సేవలందించారు. జిల్లాలో పెద్ద బంధువర్గం ఉన్న కోట రెడ్డి టిడిపిని విడట౦ పార్టీకి దెబ్బేనని భావిస్తున్నారు.

పార్టీలో చేరి కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి తో పాటు పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రాంకోటియారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.

ఏపీ ప్రజల ప్రయోజనాల కోసం వైసీపీ అధినేత జగన్ చేస్తున్న పోరాటం అభినందనీయమని, ఆయన ద్వారానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని వస్తుందని తానే కాదు ప్రజలంతా గట్టిగా విశ్వసిస్తున్నారు అన్నారు. రాష్ట్రాన్ని అన్యాయంగా పడగొట్టిన కాంగ్రెస్ తో సీఎం చంద్రబాబు జతకట్టి రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగు న్యాయం జరుగుతుందని అన్నారు. అందువల్లనే తాను పార్టీలో చేరానని చెప్పారు. జగన్ ప్రకటించిన నవరత్నాలు కార్యక్రమం పట్ల ఆకర్షితులై తన తండ్రితో పాటు పార్టీలో చేరాము అని ఆయన తనయులు కేతిరెడ్డి కళాధర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.

జగన్ ప్రకటించిన నవరత్నాలు పథకాన్ని చంద్రబాబునాయుడు కాపీ కొడుతున్నారని కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప రెడ్డి విమర్శించారు. చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చే ఎన్నికల్లో ఆయనకు భంగపాటు తప్పదన్నారు. ఏ పల్లెకు వెళ్లి నా నిన్ను నమ్మం బాబు నమ్మమంటున నినదిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *