కర్మ కాకపోతే.. కెమెరాను ఎక్కడెక్కడో పెడుతున్నాడంటూ ట్రోల్ చేశారు…ఆ హీరోయిన్ బ్యాగ్రౌండ్ చాలానే ఉంది.

నగ్నం హీరోయిన్ బ్యాగ్రౌండ్ చాలా ఉందే.. యూఎస్‌లో మాస్టర్స్ చేసిన ఆమె వర్మకెలా చిక్కింది.. టాలీవుడ్‌లో మరో శ్రీ!

నగ్నం సినిమా టీజర్, ట్రైలర్స్ చూసిన తరువాత అందులో నటించిన హీరోయిన్‌పై రకరకాల కామెంట్స్ వినిపించాయి.

ఆమెను ఎక్కడ నుంచి తీసుకువచ్చాడ్రా బాబూ వర్మ.. మన కర్మ కాకపోతే.. కెమెరాను ఎక్కడెక్కడో పెడుతున్నాడంటూ ట్రోల్ చేశారు.

అయితే ఆ హీరోయిన్ బ్యాగ్రౌండ్ చాలానే ఉంది.


రామ్ గోపాల్ వర్మ సంచలన చిత్రం ‘నగ్నం’ ఆన్ లైన్‌లో విడుదలై.. కాసులు కురిపిస్తుంది.

వర్మ రీసెంట్ చిత్రాల మాదిరిగానే ఈ లఘు చిత్రం కూడా నిరాశ పరిచినా.. వర్మ కాన్సెప్ట్ హిట్, ఫ్లాప్ కాదు.. పైసా ఖర్చు లేకుండా ప్రచారం చేశామా లేదా అన్నదే ముఖ్యం.

సో.. ‘నగ్నం’ సినిమా టీజర్, ట్రైలర్‌లతో సినిమాపై అంచనాలు పెంచేశారు. పోర్న్ చిత్రాల దర్శకుడిగా ఈ మధ్య పేరు సంపాదించిన వర్మ..

ఆ పేరుకి పూర్తి న్యాయం చేస్తూ వెస్ట్ గోదావరి స్వీటీ పాపతో ‘నగ్నం’ అనే నగ్న చిత్రాన్ని రూపొందించి ఆన్ లైన్‌లో రిలీజ్ చేశాడు.

అయితే ఈ చిత్రంలో నటించిన హీరోయిన్‌ని సోషల్ మీడియాలో స్వీటీగా పరిచయం చేశారు వర్మ.

ఆమెది ఆంధ్రప్రదేశ్‌ వెస్ట్ గోదావరిలోని దేవరపల్లి అని తెలియజేస్తూ ఆమెకు సంబంధించిన ‘నగ్నం’ చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు వర్మ.

ఇక ఈ సినిమా విడుదల అనంతరం వరుస ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది నగ్నం హీరోయిన్ స్వీటీ. ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేసింది.

ఆమె అసలు పేరు శ్రీ రాపాక. ఇండస్ట్రీలో ముద్దుగా శ్రీ అనిపిలుస్తారట.

ఈమెకు ఇండస్ట్రీతో మంచి అనుబంధమే ఉంది. టీవీ రంగంలోని సత్తా చాటిందట.

ఆ విషయాలను తెలియజేస్తూ.. ‘రంగస్థలం షోతో పాటు కబాడీ లీగ్స్‌లో పాల్గొన్నాను. స్టార్ వార్‌తో పాటు

కిర్రాక్ కబాడీ ట్రోపీల విన్నర్‌ని నేను. ఆ తరువాత రంగస్థలం షో చేశా.. జెమినిలోనే టాప్ రేటింగ్ షో రంగస్థలంలో చాలా రోజులు చేశా.

ఫైనల్ వరకూ వెళ్లా. బేసిక్‌గా నేను ఫ్యాషన్ డిజైనర్‌ని.. తెలుగు, కన్నడ, తమిళ్‌లో 40కి పైగా చిత్రాలకు క్యాస్ట్యూమ్ డిజైనర్‌గా చేశా.

హైదరాబాద్ నిఫ్ట్‌లో చదువుకున్నా. మాస్టర్స్ యూఎస్‌లో చేశా.

నిఫ్ట్‌లో చేస్తూనే సినిమాలకు క్యాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశా.

ఇంటర్మీడియట్ అవ్వగానే నిఫ్ట్‌ల్ జాయిన్ అయ్యా.. ఫస్ట్ ఇయర్ నుంచి సినిమాలకు క్యాస్ట్యూమ్ డిజైనర్‌గా చేస్తున్నా.

దేశముదురు, చందమామ, యువత, నచ్చావులే ఇలా చాలా సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్‌గా చేశా.

వర్మ ‘నగ్నం’ చిత్రంలో అవకాశం వచ్చిందంటే.. రీసెంట్‌గా వలయం అనే సినిమాకి నేను క్యాస్ట్యూమ్ డిజైనర్.

ఆ సినిమాలో చేసే ఓ ఆర్టిస్ట్ టైంకి రాకుండా హ్యాండ్ ఇచ్చింది. అదే టైం నన్ను చేయమని అడిగారు. నిజానికి నాకు చిన్న చిన్న క్యారెక్టర్లు చేయడం ఇష్టం లేదు.

నాకు ఫిదా సినిమాలో సాయి పల్లవి సిస్టర్‌గా చేయమని శేఖర్ కమ్ముల గారు అడిగారు.. కాని నేను చేయనని చెప్పాను. ఇష్టం లేదన్నా.

అయితే వలయం సినిమా విషయంలో నన్ను బాగా బలవంతం పెట్టారు.

దీంతో కాదనలేక ఆ సినిమాలో ఒక పాత్ర చేశా.

అయితే ఈ సినిమాకి పనిచేసిన వెంకట్ అనే అబ్బాయి..

నగ్నం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ కావడంతో నాకు మళ్లీ అవకాశం వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది స్వీటీ పాప.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *