ఇండస్ట్రీ నన్ను బ్యాన్ చేయడం ఏంటి? కుక్కలు మొరిగితే పట్టించుకోను: వర్మ సంచలన కామెంట్స్

ఆర్జీవీ వరల్డ్ అంటూ సొంతంగా ఇండస్ట్రీని క్రియేట్ చేసుకుని ఆన్ లైన్‌లో సినిమాలు విడుదల చేస్తున్న వర్మ.. తెలుగు సినిమా పరిశ్రమపై సంచలన కామెంట్స్ చేశారు.
పవర్ స్టార్ సినిమాకి రెస్పాన్స్ అదిరిపోయింది అంటున్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.
పవర్ స్టార్ సినిమా సక్సెస్ కంటే కూడా.. ఆన్ లైన్‌లో ఇంత డబ్బు పెట్టి కొంటారు అనేది ఒకటి.. ‘పవర్ స్టార్’ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి ప్రత్యామ్నాయం వచ్చిందన్నారాయ.
వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘పవర్ స్టార్’ మూవీ ఆర్జీవీ వరల్డ్ థియేటర్స్‌లో విడుదల కావడంతో ఇండస్ట్రీపైన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పైన సంచలన కామెంట్స్ చేశారు వర్మ.
తెలుగు సినిమా శివ ముందు.. శివ తరువాత ఎలాగైతే అయ్యిందో.. ఆన్ లైన్ థియేటర్స్‌లో ఆర్జీవీ ‘పవర్ స్టార్’ ముందు.. తరువాత అని చెప్పుకుంటారు.
దీనికి నేను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నా. అయితే ఇలా సొంతంగా సినిమాని ఆన్ లైన్‌లో రిలీజ్ చేయడం వల్ల.. ఇండస్ట్రీ నాపై బ్యాన్ విధిస్తుంది అంటూ ఛానల్స్ వాళ్లు (టీవీ 9) అంటున్నారు.. వాళ్లకి నేను ఫస్ట్ ఒకటి చెప్పాలనుకుంటున్నా.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి నాకు సంబంధమే లేదు.
నా ఇండస్ట్రీ ఒక్కటే.. అదే ఆర్జీవీ ఇండస్ట్రీ. నా కథ, నా సినిమా, నా టెక్నీషియన్స్, నా యాక్టర్స్.. అంతా కలిసి చేసిన సినిమా.. నా థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం.
తెలుగు సినిమా ఇండస్ట్రీతో నాకు సంబంధం లేదు.. వాళ్లు బ్యాన్ చేయడానికి ఏం లేదు.
అలాగే ఓయూ జేఏసీ, కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకా మాట్లాడుతూ ఏదో చేస్తాం అదీ ఇదీ అంటున్నారు.
కుక్కలు మొరుగుతాయి.. ఇలా మొరిగే ప్రతి కుక్కకీ నేను సమాధానం చెప్పను.
వాళ్లు మొన్న వచ్చి ఆఫీస్‌పై దాడి చేశారు.. వచ్చింది ఏడుగురు.. ఆ టైంలో నా ఆఫీస్‌లో 50 మంది ఉన్నారు. కాని మా వాళ్లు ఏం చేయలేదు.
వాళ్లలో వాళ్లే కొట్టుకున్నారు. మా దగ్గర వీడియో ఎవిడెన్స్ కూడా ఉంది. అది పోలీసులకు ఇస్తున్నాం.
నా అంతు చూస్తా.. తాట తీస్తా లాంటి వార్నింగ్‌లు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా.
నేను ఓయూ జేఏసీని తిట్టలేదు.. ఓయూ జేఏసీ అంటూ కొంతమంది రచ్చ చేస్తున్నారని చెప్పా.
ఈ సినిమాని చూడొద్దని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇతర హీరోల ఫ్యాన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నారు.. అయితే చూసేవాడు ఒకరు చెప్తే ఆగడు.. చూసేవాడు చూస్తాడు. ఎంతమంది చూశారు.. ఎంత డబ్బు వచ్చిందో చెప్తే గుండెలు పగిలి చచ్చిపోతారు.
వాళ్ల ఆరోగ్యాల దృష్ట్యా నేను చెప్పను. ఇది ఫిక్షనల్ స్టోరీ పవన్ కళ్యాణ్ గురించి కాదు.. అని వందల సార్లు చెప్పా.. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తలకి ఎక్కడం లేదు.. వాళ్లకు ఇష్టం ఉంటే చూడమనండి లేదంటే మానేయమనండి అంటూ పవర్ స్టార్ మూవీ విడుదల తరువాత తన స్పందనను తెలియజేశారు వర్మ.