ఆ వీడియో చూడగానే కళ్లు చెమర్చాయి.. జీవితంలో ప్రతీదీ ఓ గుణపాఠమే..ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి రెండు దశాబ్దాలు పూర్తయ్యాయి.
ఈ సందర్భంగా తన 20 ఏళ్ల జర్నీ తాలూకు వీడియో పోస్ట్ చేస్తూ ఆసక్తికరంగా స్పందించింది ప్రియాంక.
ఆ వీడియో చూడగానే నా కళ్లు చెమర్చాయి.. ప్రతీదీ గుణపాఠమే ప్రియాంక చోప్రా
గ్లోబల్ స్టార్, హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు పూర్తయ్యాయి.
2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకొని వెలుగులోకి వచ్చిన ఈ బ్యూటీ..2002 సంవత్సరంలో ‘తమిళన్’ అనే తమిళ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది.
ఆ తర్వాత2003 సంవత్సరంలో ”ది హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై” అనే చిత్రంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోఅడుగుపెట్టి క్రమంగా స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
హీరోయిన్‌గా రాణిస్తూనే సింగర్‌గా, నిర్మాతగా సత్తా చాటిన ప్రియాంక చోప్రా.. ఆ తర్వాత హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించి గ్లోబల్‌స్టార్‌గా కీర్తింపబడింది.
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే 17 ఏళ్ల వయసులో కెరీర్ ఆరంభించి ఆమె సాధించిన విజయాలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రియాంక 20 ఏళ్ల జర్నీని, ఆమె సాధించిన విజయాలను చూపిస్తూ ఏడు నిమిషాల నిడివిగల వీడియో రూపొందించారు ఆమె స్నేహితులు.
తాజాగా ట్విట్టర్‌లో ఈ వీడియో పోస్ట్ చేసిన ప్రియాంక.. తన 20 ఏళ్ళ జర్నీని ఇంత అందంగా మలిచిన స్నేహితులకు ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలిపింది. ”ఈ వీడియో చూడగానే నా కళ్లు చెమర్చాయి.
నా గతం మొత్తం కళ్లముందు కనిపించింది. ఈ జర్నీలో అందుకున్న ప్రశంసలు, విమర్శలు అన్నీ కూడా గుణపాఠాలే.
అప్పుడే ఇరవై ఏళ్లు పూర్తయ్యాయా! అనిపిస్తోంది. మీ అందరి ఆశీస్సులతో మరి కొంతకాలం ఇలాగే నా జర్నీ కొనగాలని ఆశిస్తున్నాను” అని ఈ సందర్భంగా పేర్కొంది ప్రియాంక చోప్రా.
సినిమాలతో పాటు సోషల్ మీడియా లోనూ యాక్టివ్‌గా ఉండటం ప్రియాంక చోప్రా నైజం.
నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను పంచుకుంటూ హాట్ ట్రీట్ ఇస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ.
ఇకపోతే.. తనకంటే పదేళ్లు చిన్నవాడైన హలీవుడ్ గాయకుడు నిక్ జోనాస్‌ని ప్రేమించి పెళ్ళాడి ప్రస్తుతం హాయిగా తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది ప్రియాంక.