“వకీల్ సాబ్” న్యాయవాది పాత్రలోపవన్ కళ్యాణ్..ఆఫర్ రిజెక్ట్ చేసిన శృతి హాసన్!! కారణమిదే..

వకీల్ సాబ్ ఆఫర్ రిజెక్ట్ చేసిన శృతి హాసన్!! కారణమిదే..
పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వకీల్ సాబ్’ సినిమాలో శృతి హాసన్ నటించనుందనే వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలో తాజాగా అందిన సమాచారం మేరకు ఈ మూవీ ఆఫర్ రిజెక్ట్ చేసిందట శృతి.

వకీల్ సాబ్’ సినిమాతో పవన్ కళ్యాణ్ మరోసారి వెండితెర సందడి చేయనున్న సంగతి తెలిసిందే.

బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘పింక్’ రీమేక్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

వేణు శ్రీరామ్ దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. చిత్రంలో పవన్ న్యాయవాది పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అయితే ఈ మూవీలో మరో హీరోయిన్‌కి కూడా ఛాన్స్ ఉందట. అందుకోసం ఇటీవలే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్‌ని సంప్రదించారట దర్శకనిర్మాతలు.

కానీ ఆ ఆఫర్‌ని శృతి హాసన్ సున్నితంగా తిరస్కరించిందని తెలుస్తోంది.

రీ ఎంట్రీలో నిడివి తక్కువ ఉండే పాత్రలు, సెకండ్ హీరోయిన్ రోల్స్ చేస్తే కెరీర్ గాడి తప్పే ప్రమాదం ఉందని ఆమె ఈ నిర్ణయం తీసుకుందట.

నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ వేణు శ్రీరామ్ అలాగే హీరో పవన్ కళ్యాణ్ లతో గతంలో సినిమాలు చేసిన అనుభవం ఉన్నప్పటికీ, పాత్ర నిడివి తక్కువగా ఉందనే కోణంలోనే వాళ్ళ ఆఫర్ కాదనుకుందట శృతి హాసన్.

తాజాగా బయటకొచ్చిన ఈ వార్తతో వకీల్ సాబ్ సినిమాలో శృతి హాసన్ నటించనుందనే వార్తలకు ఫుల్‌స్టాప్ పడినట్లయింది.

ఇకపోతే రీ ఎంట్రీ ఆరంభంలోనే రవితేజతో రొమాన్స్ చేసింది శృతి హాసన్. క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘క్రాక్’ సినిమాలో నటించింది.

ఈ మూవీ షూటింగ్ ఫినిష్ చేసుకొని విడుదలకు సిద్ధమైన క్రమంలో లాక్‌డౌన్ రావడంతో వాయిదా పడింది. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. సినీ కెరీర్‌పై శ్రద్ద పెట్టిన శృతి మరో ఇద్దరు బడా దర్శకుల కథలు విన్నట్లు టాక్.

మరికొద్ది రోజుల్లో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. సినీ కెరీర్‌పై శ్రద్ద పెట్టిన శృతి మరో ఇద్దరు బడా దర్శకుల కథలు విన్నట్లు టాక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *