‘యాత్ర’ ఫస్ట్ టికెట్ ధర వేలంపాటలో4.37 లక్షలకి యూఎస్ లో ఒక అభిమాని సొంతం.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం యాత్ర.

రాజశేఖర్ జీవిత చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టం పాదయాత్ర. ఆ నేపథ్యం తో యాత్ర చిత్రం తెరకెక్కింది. ‘మహి వి రాఘవ్’ ఈ చిత్రానికి దర్శకుడు.

టాలీవుడ్లో వరుసగా బయోపిక్ చిత్రాలు వస్తున్న సమయంలో ‘యాత్ర’ చిత్రం మరింత ఆసక్తి .రేపుతోంది. ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్ మొటిభాగం ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ సంగతి తెలిసిందే. ఇక ఫిబ్రవరి 8 న ‘యాత్ర’ చిత్రం రాబోతుంది.

దర్శకుడు ‘మహి వి రాఘవ్’ అని చిత్రంలో Y S RAJASEKHAR REDDY గారు 2003 లో చేసిన పాదయాత్రను కీలకంగా చూపించబోతున్నారు.

‘మమ్ముట్టి’ ‘వైఎస్ఆర్’ పాత్రలో అద్భుతంగా నటించారు. అయన చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆయనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు.

ఎమోషనల్ సన్నివేశాల్లో మమ్ముట్టి నటన హృదయాన్ని హత్తుకునేలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

అంతేగాక ఈ చిత్రంలో వైయస్సార్ ప్రవేశపెట్టిన పథకాల గురించి కూడా చూపించినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వైయస్సార్ అభిమానించే వాళ్ళు చాలామందే ఉన్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి వెళ్లాయి.

తాజాగా ఓ అభిమాని యూఎస్ లో ‘యాత్ర’ సినిమా టికెట్ ని వేలంపాటలో 4. 37 లక్షలకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

మునీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ పై ఉన్న అభిమానంతో ఇంత మొత్తం చెల్లించి టిక్కెట్ దక్కించుకున్నారు.

సాధారణంగా USA లో టికెట్ ధర 12 డాలర్లు. కానీ మునీశ్వర్ రెడ్డి వేలంపాటలో 6 ,116 డాలర్లకు అందుకున్నారు. ఈ తొలి టికెట్ డబ్బుని నిర్మాతలు ‘వైయస్సార్ చారిటీ ఫౌండేషన్’ కు తరలించినట్లు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం మొదలు కావడంతో ‘ఎన్టీఆర్- మహానాయకుడు’, ‘యాత్ర’ చిత్రాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.

ఈ రెండు చిత్రాలు విడుదల అయ్యాక రాజకీయ చర్చ మరింత పెరుగుతుంది అనడంలో సందేహమే లేదు.

‘యాత్ర’ చిత్ర విషయంలో జగన్ ప్రమేయం ఉందని వార్తలు వచ్చాయి. ఆ వార్తలను దర్శకుడు మహి వి రాఘవ్ ఖండించారు. జగన్ ఈ చిత్రానికి ఫండ్స్ ఇచ్చారనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు.

కేవలం మా తండ్రి చేసేవి చూపించండి చేయనవి వద్దు తనతో చెప్పినట్లు రాఘవ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *