సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి పద్మశ్రీ పురస్కారం

విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన చెంబోలు సీతారామశాస్త్రి వైద్యుడు కాబోయి అక్షర వైద్యుడయ్యారు.
మూడున్నర దశాబ్దాల పాటు సినిమాల్లో ఎన్నో స్వర్ణ కమలాలను వికసింప చేసే అద్భుత గేయ రచయితి ఆయన.

నంది అవార్డులను లెక్కలు మిక్కిలి తీసుకున్న సీతారామశాస్త్రి ప్రతీ పాటా ఓ అమృతమే.
అందులోని భావాలు అపురూపమే. సుదీర్ఘకాలం పాటు సినిమా గేయ రచయితగా విశేష సేవలు అందించిన సీతారామశాస్త్రి ప్రతిభకు హద్దులు లేవు.
ఆయన కలానికి కూడా ఏ ముద్ర లేదు, విప్లవ గీతాలును రాసిన చేత్తోనే ప్రయాణ గీతాలను , విషాద గీతాలు రాయడం ఆయనకే చెల్లింది.
సమాజానికి సందేశాన్ని అందించే పాటలను శ్రీశ్రీ తర్వాత రాసినది సీతారామశాస్త్రి ఒక్కరేనంటే అతిశయోక్తి కాదు.
సిరివెన్నెల సినిమా ద్వారా చలనచిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన ఆయన వేలాది పాటలను రాసి తెలుగువారిని ఆకట్టుకున్నారు.
తెలుగు భాషా మాధుర్యం ఆయన పాటల్లో పల్లవిస్తుందిని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సీతారామశాస్త్రి పాటకు పట్టాభిషేకం చేస్తే కేంద్ర ప్రభుత్వం 2019 సంవత్సరానికి గాను పద్మశ్రీ పురస్కారాన్ని ఇవ్వడం పట్ల తెలుగు భాషాభిమానులు, సాహితీవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ కోటాలో ఆయనకు పద్మశ్రీ దక్కడం ఆనందకరమైన విషయం.
ప్రాంతాలు వేరైనా మనమంతా ఒక్కటే అన్నా సందేశానికి గుర్తుగా సీతారామశాస్త్రిని ఈ అవార్డుకు సిఫార్సు చేసిన కెసిఆర్ ప్రభుత్వానికి ధన్యవాదాలును ప్రతి తెలుగువారూ తెలియజేస్తున్నారు.