S.P. బాలసుబ్రహ్మణ్యం కు మాతృవియోగం

ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.
అయన మాతృమూర్తి శకుంతలమ్మ (89) ఈరోజు ఉదయం ఏడు గంటలకు కన్నుమూశారు.

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు తుది శ్వాస విడిచారు.
విదేశాల్లో సంగీత విభావరి కార్యక్రమాలు నిమిత్తంగా లండన్ లో ఉన్న బాలు ఈ వార్త తెలియగానే బయలుదేరారు.
ఈ రోజు రాత్రి వరకు బాలు తన స్వస్థలమైన నెల్లూరు కు చేరుకునే అవకాశాలు ఉన్నాయి.
మంగళవారం తల్లి శకుంతలమ్మ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
బాలసుబ్రమణ్యం తల్లి మృతి కి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.