రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది..ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్..దర్శకుడికి షాక్!

ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ విడుదల కావడంతో ఆ సినిమా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.
దర్శకత్వం వహించిన తొలి చిత్రంతోనే హిట్ అందుకున్న ఈ దర్శకుడు..
ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ప్రేమకు ప్రతిరూపం ఈ ‘రాధే శ్యామ్’ అంటూ విడుదలైన ఈ ఫస్ట్‌లుక్ చాలా రొమాంటిక్‌గానే కాకుండా రాయల్‌గానూ ఉంది.
అయితే గతంలో తరహా చిత్రాలు ‘కంచెం’ లాంటి సినిమాల్లో కనిపించడంతో ట్రోలింగ్స్ కూడా అదే రేంజ్‌లో ఉన్నాయి.
మొత్తానికైతే ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ ఆకట్టుకుందనే చెప్పాలి. విడుదలైన 25 గంటల్లోనే 6.3 మిలియన్ల ట్వీట్స్ ఈ ఫస్ట్ లుక్‌కి రావడంతో ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అంచనా వేయొచ్చు.
ఇక ఈ ఫస్ట్ లుక్ విడుదల కాగానే ప్రభాస్, పూజాలతో పాటు ఎక్కువ మంది ఈ సినిమా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ కోసం నెట్టింట్లో వేట సాగించారు. ఆయన అంతకు ముందు ఏం సినిమాలు చేశారు..
ప్రభాస్‌తో సినిమా ఆఫర్‌కి కారణం ఏంటి తదితర విషయాలపై కూపీ లాగడంతో రాధాకృష్ణ కుమార్ కూడా బాగా ట్రెండ్ అయ్యారు.
ఈ క్రమంలో డైరెక్టర్ రాధాకృష్ణకి ఇన్‌స్టాగ్రామ్ షాక్ ఇచ్చింది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని బ్లాక్ చేసి.. సిల్లీ రీజన్ ఇచ్చిందట.
ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ.. ‘ఫన్ ఫ్యాక్ట్ ఆఫ్ ది డే.. ఇన్ స్టాగ్రామ్ నా అకౌంట్‌ని బ్లాక్ చేసింది.
నేను వేరే వ్యక్తిలా నటిస్తున్నానంట.. ఆ వ్యక్తి ఎవరో మరి’ అంటూ సెటైర్ వేస్తూ స్మైలీ ఎమోజీలను షేర్ చేశారు డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్.
అయితే ఆయన పోస్ట్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ జోక్‌లు పేల్చుతున్నారు. మీరు ఫస్ట్ లుక్ అండ్ అప్డేట్స్ ఇవ్వడం లేదని మేమే రిపోర్ట్ చేశాం ఇన్ స్టాగ్రామ్ వాళ్లకి..
సరే కాని ఫ్యాన్స్ మాత్రం టచ్‌లో ఉండు.. ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికి ప్రభాస్ బొమ్మ థియేటర్స్‌లో పడిపోవాలి.. లేదంటూ ట్విట్టర్ కూడా మిగలదు అంటూ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
ఇక ఈ దర్శకుడు చేసింది రెండే సినిమాలు అయినా.. ఇండస్ట్రీలో 2005 నుంచి ఉన్నారు. అనుకోకుండా ఓరోజు చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న రాధాకృష్ణ కుమార్.. ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం వంటి చిత్రాలకు రైటర్‌గానూ, అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పనిచేశారు.
అనంతరం 2015లో గోపీచంద్ ‘జిల్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యి తొలి సినిమాతోనే హిట్ అందుకున్నారు.
మళ్లీ ఐదేళ్ల తరువాత ప్రభాస్‌తో రాధే శ్యామ్ సినిమా చేస్తున్నారు రాధాకృష్ణ.
ఈ సినిమా స్క్రిప్ట్ ప్రభాస్‌కి బాహుబలి అప్పుడే వినిపించగా.. ఆయన డేట్స్ దొరక్కపోవడంతో ‘రాధేశ్యామ్’ సినిమా పట్టాలెక్కేందుకు ఆలస్యం అయ్యింది.