నితిన్ పెళ్లి: సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం.. స్వయంగా శుభలేఖ అందజేసిన హీరో

హీరో నితిన్ పెళ్లి చేసుకోబోతోన్న సంగతి తెలిసిందే. ఈనెల 26న ఈ వివాహ వేడుక జరగనుంది. ఈ వివాహానికి సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందింది.
కేసీఆర్‌ను తన పెళ్లికి ఆహ్వానించిన హీరో నితిన్
నిన్న మొన్నటి వరకు టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో ఒకరిగా ఉన్న హీరో నితిన్ ఓ ఇంటివాడు అవుతోన్న సంగతి తెలిసిందే.
ప్రేయసి షాలినిని ఆయన వివాహం చేసుకుంటున్న విషయం విదితమే. నాగర్ కర్నూల్‌కు చెందిన డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ నూర్జహాన్ దంపతుల కుమార్తె షాలినితో ఫిబ్రవరి నెలలో పెద్దలు వివాహం నిశ్చయించారు.
ఫిబ్రవరి 15న నితిన్, షాలినిల పసుపు, కుంకుమ ఫంక్షన్ జరిగింది. ఏప్రిల్ 16న దుబాయ్‌లో వీరి వివాహం జరపాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కాకపోతే కరోనా వైరస్ వీరి ప్రణాళికలను దెబ్బతీసింది.
కరోనా వైరస్ వల్ల లాక్‌డౌన్ విధించడంతో నితిన్, షాలినిల వివాహాన్ని వాయిదా వేశారు. సుమారు నాలుగు నెలలు వాయిదా పడిన ఈ వివాహ వేడుక తేదీని ఎట్టకేలకు ఖరారు చేశారు.
ఈనెల 26న నితిన్ పెళ్లి జరగబోతోంది. ఈ వివాహ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం అందింది.
హీరో నితిన్ తన తండ్రి సుధాకర్ రెడ్డితో కలిసి ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశారు. శుభలేఖను కేసీఆర్‌కు అందజేశారు. తన వివాహానికి హాజరై ఆశీర్వదించాలని కోరారు. తాను వస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినట్టు సమాచారం.
హైదరాబాద్‌లో 26వ తేదీ రాత్రి 8.30 గంటలకు షాలినితో కలిసి ఏడడుగులు వేయబోతున్నారు నితిన్.
ప్రస్తుతం హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వ నిబంధనలను అనుసరించి నితిన్, షాలిని వివాహ వేడుకను నిర్వహించనున్నారు.
ఈ వేడుకకు కేవలం ఇరు కుటుంబాలతో పాటు సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరుకానున్నారు.