niharika konidela engagement..కోవిడ్ నిబంధనలతో..కొద్దిమంది ఫ్యామిలీ సభ్యులు మాత్రమే..పవన్ మినహా హాజరైన మెగా హీరోలు

నిరాడంబరంగా నిహారిక నిశ్చితార్థం.. పవన్ మినహా హాజరైన మెగా హీరోలు
గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యను మెగా డాటర్ నిహారిక పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే.
మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థ వేడుక నిరాడంబరంగా జరిగింది . నిహారిక – చైతన్యల నిశ్చితార్థం ఈరోజు రాత్రి 8 గంటలకు (ఆగష్టు 13) హైదరబాద్‌లో జరిగింది.
కోవిడ్ నిబంధనలతో కేవలం కొద్దిమంది ఫ్యామిలీ సభ్యులు మాత్రమే ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు.
అయితే ఈ వివాహ నిశ్చితార్థానికి పవన్ కళ్యాణ్ మినహా.. మెగా హీరోలంతా హాజరయ్యారు. చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ దేవ్, అల్లు అర్జున్, ఉపాసన, సురేఖ, శ్రీజ, సుస్మిత తదితరులు ఈ మెగా వేడుకలో సందడి చేశారు.
మెగా ఫ్యామిలీకి అల్లుడుగా రాబోతున్న జొన్నల గడ్డ చైతన్య విషయానికి వస్తే.. ఈయన గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు.
చైతన్య కుటుంబంతో మెగా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో పరిచయం ఉండటం..
చిరంజీవి తండ్రి కొణిదెల వెంకటరావు, చైతన్య తాతయ్య గుణ వెంకటరత్నం ప్రాణ స్నేహితులు కావడంతో ఈ సంబంధం సెట్ అయినట్టు తెలుస్తోంది.
చైతన్య స్వస్థలం గుంటూరు కాగా.. ఇండియన్ స్కూల్ బిజినెస్‌లో ఎంబీఏ పూర్తిచేశారు.
చైతన్య.. హైదరాబాద్‌లోని ఓ ఎంఎన్‌సీ కంపెనీలో ఉన్నత పదవిలో ఉన్నట్టు సమాచారం.
ఇక చైతన్య-నిహారికలకు ముందే పరిచయం ఉండటంతో ఒకర్నొకరు అర్థం చేసుకుని పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
అయితే నిహారిక- చైతన్యల నిశ్చితార్థం ఈ ఏడాది ఆగస్టులో, అదేవిధంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరగనుందని వార్తలు రాగా.. త్వరలోనే నిశ్చితార్థం ఉంటుందని నాగబాబు క్లారిటీ ఇచ్చారు.
మా ఇంట్లో పెళ్లి.. పబ్లిక్ పండుగ కాదు కాబట్టి పర్సనల్ గానే ట్రీట్ చేస్తున్నాం అంటూ చెప్పిన నాగబాబు..
పెళ్లిని ఇలాంటి పరిస్థితుల్లో అట్టహాసంగా చేయడం కుదరదని చెప్పారు నాగబాబు.
అన్నట్టుగానే నిహారిక నిశ్చితార్థ వేడుకను చాలా సింపుల్‌గా నిర్వహించారు.
ప్రస్తుతం నిహారిక నిశ్చితార్థ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.