రైతన్న గుండె చప్పుడునీ, నేలతల్లి పురిటి నొప్పులనీ స్పృశిస్తూ ‘యాత్ర’లా సాగుతున్న పాట

పల్లెల్లో కళ వుందీ అంటూ – ఈ పాట విన్న ప్రతి ఒక్కరికీ రోమాలు నిక్కపొడిచేలా రైతు గుండెల్లోని బాధని ఎంతో స్పష్టంగా చూపించారు ‘యాత్ర’ సినిమాలో.

ఎన్నికలు సమీపంలో ఉన్నాయి ఇలాంటి సమయంలో యాత్ర సినిమాలో పల్లెల్లో కళ ఉంది అంటూ ప్రతి రైతు మనసులో ఉండే భావాలను ఎంతో చక్కగా ఒక పాట రూపంలో ప్రజలకు, అలాగే ప్రతి రాజకీయ వ్యక్తులకు రైతు యొక్క విశిష్టతను అందజేయడమే యాత్ర సినిమాలో ముఖ్య ఉద్దెశ్యం.

రైతు గుండెల్లో మంటుంది. కళ్ళల్లో నీరుంది. ఒళ్లంతా చేమాటుంది. నిజానికి ప్రతి రైతు కష్టపడి, తన రక్తాన్ని చెమట రూపంలో చిందించినందువల్లే ఆ పొలం చిగురిస్తుంది.
చెరువులు ఎండి, వర్షాలు లేక , కరెంటు కోతలతో రైతులు బాధపడుతూ ఉంటే – ఈనాటి పాలకులేమో ఓట్ల కోసం, రైతులకు రుణమాఫీ అంటూ, రైతులను మోసం చేస్తున్నారు. ఆ మోసపోయిన రైతులు రుణాలు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

చినుకివ్వని మబ్బు ఉంది. మొలకివ్వని మన్నూ ఉంది. సమయానికి కరుణించని కరువు ఉంది. నిజానికి రైతు కష్టాల్లో ఉన్నప్పుడు కరుణించే నాయకులు కరువయ్యారు.
రైతేగా రాజు అంటూ ఊరడిస్తే ఉపోయోగం లేదు, ఇంకా అది వాళ్ళకి నిందలా వినపడుతోంది, రైతును ఆదుకునే వారు లేనప్పుడు!.

నాణ్యతలేని ఎరువులు తక్కువ రేటుకి ఇచ్చి, ఈ నాయకులు రైతులకు మేలు చేస్తున్నామని నమ్మబలుకుతున్నారు. ఒక రైతు బాధ, నిజానికి, రైతుబిడ్డడైన రాజన్నకు మాత్రమే తెలుసు. ఇప్పుడు తండ్రి బాటలో నడుస్తున్న తనయుడిగా మన జగనన్నకూ రైతు ఆవేదన తెలుసు. ఈ పాట విన్న తర్వాత అయినా ప్రజలు… జనం మధ్య నుండి, జనంతో నడుస్తూ, నేనున్నానంటూ భరోసా ఇస్తున్న జగనన్నని గుర్తించి, రానున్న ఎన్నికల్లో ఆయనని అఖండ మెజారిటీతో గెలిపించి, మన రాజన్న రాజ్యాన్ని తెచ్చుకోవాలి. కర్షకుల బలిమికోసం, కార్మికుల శ్రేయస్సుకోసం, విద్యార్థుల చదువులకోసం, ఆడ బిడ్డల ఆత్మ రక్షణకోసం, వృద్ధుల జీవన భృతికోసం ఇంకా అందరి ఆరోగ్యాలకోసం మన జగనన్నని మనమే తెచ్చుకొందాం !!!

పల్లెల్లో కళ వుందీ అంటూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *