అభిమాన గుండెలు ఆద‌రించే హీరోగా, రోల్‌మోడ‌ల్‌గా నిలిచిన టాలీవుడ్ స్టార్ మహేష్ బాబుకు..ఎమ్మెల్యే రోజా బర్త్‌డే విషెస్

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎమ్మెల్యే రోజా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ బాబుపై ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు 45వ పుట్టినరోజు జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా మహేష్ బాబుకు ఆయన అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వీరిలో నటి, నగరి ఎమ్మెల్యే రోజా కూడా ఉన్నారు.

‘‘సూపర్ స్టార్ కృష్ణ గారి న‌ట వార‌స‌త్వాన్ని పుణికిపుచ్చుకుని కోట్లాది అభిమాన గుండెలు ఆద‌రించే హీరోగా, రోల్‌మోడ‌ల్‌గా నిలిచిన టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

ఇలాంటి పుట్టిన రోజు వేడుక‌లు మ‌రెన్నో జ‌రుపుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నా’’ అని రోజా ట్వీట్‌లో పేర్కొన్నారు.

రోజా ఇప్పటి వరకు మహేష్ బాబు సినిమాల్లో నటించలేదు. కానీ, ఆయన తండ్రి, నటశేఖర కృష్ణ సినిమాల్లో ఆమె నటించారు. ‘తెలుగు వీర లేవర’, ‘ఎన్‌కౌంటర్’ సినిమాలు సహా మరో రెండు మూడు చిత్రాల్లో వీరిద్దరూ నటించారు.

అయితే, మూడేళ్ల క్రితం ‘స్పైడర్’ సినిమా సమయంలో మహేష్ బాబును రోజా ఇంటర్వ్యూ చేశారు.

దీంతో మహేష్ బాబుతో కూడా ఆమెకు మంచి పరిచయం ఏర్పడింది. ఈ బంధంతోనే మహేష్‌కు రోజా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఇదిలా ఉంటే, మ‌హేష్ బాబు పుట్టిన‌రోజు సందర్భంగా ఆయన కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’ మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ మోషన్ పోస్టర్, తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

ఇప్పటికే విడుదలైన ప్రి-లుక్‌లో స్టైలిష్‌గా మెడ మీద వన్ రూపీ కాయిన్ టాటూతో ఇయర్ రింగ్ పెట్టుకుని కనిపించిన మహేష్.. ఇప్పుడు మోషన్ పోస్టర్‌లో ఆ కాయిన్ టాస్ చేస్తూ క‌నిపించారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టై‌న్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *