గోపీచంద్, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘చాణక్య’సినిమా దసరా కానుకగా శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది..

1.వాళ్లు ఎత్తేస్తున్నారు.. వీళ్లు దించేస్తున్నారు!
2.గోపీచంద్, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘చాణక్య’ సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి.

మాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన సినిమా ‘చాణక్య’. మెహ్రీన్ హీరోయిన్‌గా నటించారు. బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ కీలక పాత్ర పోషించారు.

తమిళ దర్శకుడు తిరు దర్శకత్వం వహించారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.

స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇప్పటికే ఈ చిత్రం ప్రీమియర్ షోలు యూఎస్‌లో ప్రారంభమయ్యాయి. అక్కడ సినిమా చూసిన వాళ్లు ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు.

అలాగే, టాలీవుడ్ ప్రముఖులకు శుక్రవారం ‘చాణక్య’ సినిమాను ప్రదర్శించారు. వాళ్లు సైతం ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను చెబుతున్నారు.

తెలుగు సినిమా ప్రముఖులైతే ‘చాణక్య’ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. డైరెక్టర్ శ్రీను వైట్ల ఈ సినిమాపై ట్వీట్ చేశారు.

సినిమా చాలా గ్రిప్పింగ్‌గా ఉందని, చాలా బాగా తీశారని కొనియాడారు. స్పై థ్రిల్లర్‌లో ఒక వైవిధ్య కోణాన్ని ఎంపిక చేసుకుని చూపించారన్నారు.

గోపీచంద్ లుక్ ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని విధంగా ఉందని పేర్కొన్నారు. స్పై పాత్రలో ఆయన చాలా బాగా నటించారని చెప్పారు.

డీఓపీ వెట్రి వర్క్ తెరపై చూడటానికి ఎంతో బాగుందన్నారు. శ్రీ చరణ్ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారని ప్రశంసించారు.

తిరు డైరెక్షన్ కూడా చాలా గొప్పగా ఉందని కొనియాడారు. మొత్తం మీద సినిమా సూపర్ హిట్ అని రివ్యూ ఇచ్చేశారు.

సినీ రచయిత గోపీమోహన్ కూడా ‘చాణక్య’పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇది గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్ అని అన్నారు.

ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, సెకండాఫ్ సూపర్ అని ట్వీట్ చేశారు. తిరు డైరెక్షన్, డైలాగులు, కెమెరా, రీరికార్డింగ్ సినిమాకు బలాలన్నారు.

అలాగే, సంగీత దర్శకుడు రఘు కుంచె.. సినిమా చాలా చాలా ఇంట్రస్టింగ్‌గా ఉందని ట్వీట్ చేశారు. మొత్తానికి సినీ ఇండస్ట్రీకి చెందినవారైతే సినిమా సూపర్ హిట్ అని చెబుతున్నారు. కానీ, యూఎస్ విమర్శకుల టాక్ మరోలా ఉంది.

సినిమాలో కొత్తదనం ఏమీలేదని, ఎప్పటిలానే రొటీన్‌గా ఉందని అంటున్నారు. అస్సలు లాజిక్ లేని రివేంజ్ స్టోరీకి ‘రా’ ఏజెంట్ రంగు అద్దారని విమర్శిస్తున్నారు.

అవసరంలేని చోట పాటలు పెట్టి విసిగించారని ట్వీట్లు చేస్తున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఏమీ బాగోలేవట. రొటీన్ కమర్షియల్ స్టోరీని అస్సలు ఆసక్తికరంగా లేకుండా వండి వార్చారని మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు.

గోపీచంద్ సక్సెస్ వేట ఇంకా ఆగలేదని అంటున్నారు. అయితే, గోపీచంద్ అభిమానులు మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ట్విట్టర్‌లో ప్రచారం చేస్తున్నారు. కొంతమంది అయితే ‘సైరా’తో పోల్చుతూ ట్వీట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *