డార్లింగ్ ప్రభాస్ డైలాగ్స్‌కు,కిస్ మీ క్లోజ్ యువర్ ఐస్ అంటూ సాగే ఈ ప్రకటనలో బాహుబలి సీన్‌ను పెడుతూఎడిట్ చేశారు.

కిస్ మీ క్లోజ్ యువర్ ఐస్.. అంటున్న డార్లింగ్ ప్రభాస్
బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయం. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాహుబలి సినిమాలో ఓ సీన్‌కు స్పూప్ వీడియో హల్ చల్ చేస్తోంది.
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కున్న ఫేమ్ అంతా ఇంతా కాదు. బాహుబలి సినిమాతో ప్రభాస్ వరల్డ్ వైడ్ హీరో అయిపోయాడు.
ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రభాస్‌కు అభిమానుల్ని తెచ్చి పెట్టిన సినిమా బాహుబలి.
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ అద్భుత కళాఖండంతో తెలుగు సినిమా ప్రాధాన్యత ఖండంతారాలు దాటింది.
ఇక బాహుబలి సినిమాలో ప్రతీ సీన్‌ను కళ్లకు కట్టేలా అద్భుతంగా తీశాడు జక్కన్న.
బాహుబలి2లో ప్రభాస్ మహాష్మతి సర్వ సైన్యాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సీన్… ఆ సినిమాకే హైలెట్‌గా నిలిచింది.
ఇప్పటికీ టీవీలో బాహుబలి సినిమా వచ్చినా.. ఆ సీన్ వచ్చిన ప్రేక్షకుడు కళ్లార్పకుండే ఉండేలా తెరకెక్కించాడు రాజమౌళి.
అలాంటి గొప్ప సీన్‌ను కొందరు ఔత్సాహికులు ఎడిట్ చేశారు. ప్రభాస్ డైలాగ్స్‌కు, జనం జేజేలకు బదులు ప్రముఖ చాక్లెట్ డైరి మిల్స్ యాడ్‌ను పెడుతూ ఎడిట్ చేశారు.
కిస్ మీ క్లోజ్ యువర్ ఐస్ అంటూ సాగే ఈ ప్రకటనలో ప్రభాస్ బాహుబలి సీన్‌ను పెడుతూ ఎడిట్ చేశారు.
అయితే దీన్ని చూసిన టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఇనస్టాలో షేర్ చేశారు. హాలీవుడ్ రెబల్ స్టార్ అంటూ తన సోషల్ మీడియా ఎకౌంట్లలో ఈ వీడియోను షేర్ చేశారు మనోజ్. దీంతో ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.