కామెడీ దిశగా కింగ్ అడుగులు

బాక్సాఫీస్ సక్స్ స్ ఫార్ములా సప్తసముద్రాల ఆవల మర్రిచెట్టు తొర్రలో దాగిన చిలక లాంటిది. ఏ సినిమా హిట్ వుతుంది? ఏ సినిమా ఫట్టవుతుంది? అన్నది దిగ్గజాలే కనిపెట్టలేని సన్నివేశం ఉంది.
టాలీవుడ్ కింగ్ నాగార్జున బాలీవుడ్ కింగ్ షారూక ఖాన్ ఇద్దరికీ ఈ విషయం గత కొంతకాలంగా అర్థమవుతూనే ఉంది.
అందుకే ఇద్దరు కింగ్ లు ఈసారి ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.
షారూక్ అంతటి ఘోర పరాజయాలు ఎదుర్కొకపోయినా తాను ఆశించిన బ్లాక్ బాస్టర్లు అందుకోవడంలో కింగ్ తడబడుతూనే ఉన్నారు.
అందుకే కింగ్ ఖాన్ షారుక్ మాత్రమో కానీ కింగ్ నాగార్జున మాత్రం సాటి హీరోలతో పాటు విజయవంతంగా కెరిర్ బండిని నడిపించేందుకు సరికొత్త ఎత్తుగడల్ని అనుసరించడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.
కింగ్ ఇప్పటికే రెండు అదిరిపోయే స్ర్కిప్టుల్ని ఎంచుకున్నారు. ఈ రెండిటిలో ఫన్ కి అద్భుతమైన కామెడీ టైమింగ్ కి ఆస్కారం ఉండేలా జాగ్రత్త పడుతున్నారట.

ఆ మేరకు నాగార్జున స్పష్టంగా తన దర్శక రచయితలకు ఆజ్ఞలు వేసారట అయితే అందుకు తనలో స్ఫూర్తి నింపిన సినిమా మాత్రం ఎఫ్ 2-ఫన ఫ్రస్టేషన్ అని చెబుతున్నారు.
సంక్రాంతి బరిలో ఎఫ్ 2 సాధించిన అసాధారణ విజయం చూశాక.. కింగ్ కూడా వెంకీ దారిలోనే కామెడీ ఎంటర్ టైనర్లతో జోరు చూపించాలని భావిస్తున్నారట.
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్న బంగార్రాజు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించనున్న మన్మధుడు 2 రెండిటా కామెడీని పెర్ఫెక్ట్ టైమింగ్ తో సెట్ చెయాలని థియేటర్లో ఆడియెన్ కడుపుబ్బా నవ్వుకుంటే బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధ్యమేనని నాగార్జున భావిస్తున్నారట.
ఎఫ్ 2లో కాస్త ఘాటైన జోకులు ఉన్నవాటిని ఫ్యామిలీ ఆడియెన్ బాగానే ఎంజాయ్ చేశారు.
జంధ్యాల త్రివిక్రమ్ రేంజ్ క్లీన్ కామెడీలు చేయకపోయినా anil ravipudi రేంజు డోస్ పెంచి జోకులు వేసిన ఫర్వాలేదన్న ఆలోచన మన దర్శకులకు ఉంది.
కాబట్టి కింగ్ నటించే ఆ రెండు సినిమాల్లో కామెడీ కొత్త పుంతలు తొక్కుతుందని అంతా భావిస్తున్నారు.
అయితే వెంకీ లానే నాగార్జున కు ఫ్యామిలీ ఆడియ్ న్లో మహిళల్లో పరిమితమైన ఫాలోయింగ్ ఉంది. అందువల్ల కింగ్ ఎంతో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుందిన్నది ఓ విశ్లేషణ.
2019 దసరా 2020 సంక్రాంతి 2 పండుగల్ని క్యాచ్ చేయాలని తన సినిమాల్ని పండుగ సెలవుల్లో రిలీజ్ చేసి హిట్లు కొట్టాలని కింగ్ చాలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి, నటసింహా నందమూరి బాలకృష్ణ… వరుసగా సీరియస్ మోడ్ లో భారీ చిత్రాలతో దూసుకొస్తున్న సంగతి తెలిసిందే.
ఆ ఇద్దరితో పోలిస్తే వెంకీ నాగార్జున కెరీయర్ ప్లాన్ డిఫరెంటుగానే ఉంది.