‘ఓకే బంగారం’ పేరిట విడుదలైంది..పెళ్లిచేసుకోమని చెప్పేవాడు: నిత్యా మీనన్

నిత్యా మీనన్, దుల్కర్ సల్మాన్ సహ నటులే కాదు మంచి స్నేహితులు కూడా. దుల్కర్ సల్మాన్‌తో తనకున్న అనుబంధం గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో నిత్యా మీనన్ వెల్లడించారు.

మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్‌, నిత్యా మీనన్ జంట వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేసింది. సిల్వర్ స్క్రీన్ మీద వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి.

‘బెంగళూర్ డేస్’, ‘ఓకే కన్మని’, ‘100 డేస్ ఆఫ్ లవ్’ సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘ఓకే కన్మని’..

తెలుగులో ‘ఓకే బంగారం’ పేరిట విడుదలైంది. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అయితే, రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ విషయాన్ని నిత్యా మీనన్ స్వయంగా చెప్పారు.

తమిళ మ్యాగజైన్ సినిమా ఎక్స్‌ప్రెస్‌కు తాజాగా నిత్యా మీనన్ ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ ఇంటర్వ్యూలో దుల్కర్ సల్మాన్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. తన పెళ్లి గురించి దుల్కర్ అస్తమాను మాట్లాడేవాడని ఆమె అన్నారు.

పెళ్లిచేసుకోమని నచ్చజెప్పేవాడని తెలిపారు. ‘‘అతను కుటుంబంపై పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి. పెళ్లి చేసుకుని ఎంత సంతోషంగా ఉన్నాడో చెప్పేవాడు.

నన్ను కూడా పెళ్లిచేసుకోమని నచ్చజెప్పేవాడు’’ అని నిత్యా మీనన్ చెప్పుకొచ్చారు. స్క్రీన్ మీద తమ మధ్య కెమిస్ట్రీ గురించి పెద్దగా ఏమీ కష్టపడలేదని.. నిజానికి ఔట్‌పుట్ చూసుకున్నప్పుడు తమకే ఆశ్చర్యం కలిగిందని నిత్య వెల్లడించారు.

అలాగే, మణిరత్నం గురించి కూడా నిత్యా మీనన్ మాట్లాడారు. ‘ఓకే బంగారం’ సినిమా సమయంలో ఆయనతో ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పుకొచ్చారు. ‘‘మణి సర్ నా నుంచి ది బెస్ట్ రాబట్టారు.

ఈ సినిమాలోని తార పాత్ర నా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. చాలా సన్నివేశాలు ఫైనల్ ఎడిట్‌ వరకు రాలేదు.

కానీ, ఆ సీన్స్ అన్నీ నన్ను క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ చేయడానికి సహాయపడ్డాయి’’ అని నిత్య వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *