రష్మిక మందన ఆన్‌స్క్రీన్ బోయ్‌ఫ్రెండ్‌కు కరోనా పాజిటివ్..

‘పొగరు’ సినిమాలో రష్మిక మందనతో రొమాన్స్ చేసిన కన్నడ నటుడు ధృవ సర్జాకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది.

ఆయనతో పాటు ఆయన భార్యకు కూడా కరోనా సోకింది.

కన్నడ యంగ్ హీరో ధృవ సార్జా, ఆయన భార్య ప్రేరణకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. స్వల్ప లక్షణాలతో కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది.

ఈ విషయాన్ని ధృవ సార్జా స్వయంగా ఖరారు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘కొవిడ్ 19 పరీక్షలో నాకు, నా భార్యకు పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.

లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయి. కరోనా పాజిటివ్ అని తేలగానే మేమిద్దరం హాస్పిటల్‌లో చేరాం.

త్వరలోనే ఆరోగ్యంగా బయటికి వస్తామని నాకు నమ్మకం ఉంది’’ అని ధృవ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ మధ్యకాలంలో తనతో సన్నిహితంగా ఉన్నవారంతా ఎవరికివారు కరోనా పరీక్ష చేయించుకోవాలని ధృవ సార్జా సూచించారు. కాగా, ఇటీవల గుండెపోటుతో అకాల మరణం చెందిన కన్నడ నటుడు చిరంజీవి సార్జా తమ్ముడే ఈ ధృవ సార్జా. బహుభాషా నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్‌కు మేనల్లుడు.

2012లో వచ్చిన ‘అధురి’ సినిమా ద్వారా కన్నడ చిత్ర సీమకు ధృవ పరిచయమయ్యారు. ‘బహద్దూర్’, ‘భర్జారి’ సినిమాలతో ధృవకు మంచి గుర్తింపు లభించింది.

ధృవ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘పొగరు’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటించారు.

ఈ సినిమాలో రష్మికకు బోయ్‌ఫ్రెండ్‌గా రష్మిక కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది.

ఈ సినిమా మార్చిలో విడుదల కావాల్సి ఉంది. కరోనా కారణంగా వాయిదా పడింది. ఇదిలా ఉంటే, కన్నడ చిత్ర సీమ నుంచి ఇటీవల ఎంపీ సుమలత అంబరీశ్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీ నుంచి కరోనా పాజిటివ్ వచ్చిన మరో పాపులర్ యాక్టర్ ధృవ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *