తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో సీఎంను కలిసి సైరా సినిమా చూడాలని ఆహ్వానించిన మెగాస్టార్.

సీఎం జగన్‌తో చిరంజీవి దంపతుల భేటీ
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి దంపతుల సమావేశం.
సైరా సినిమా చూడాలని ఆహ్వానించిన మెగాస్టార్. జగన్, ఆయన సతీమణి భారతితో కలిసి భోజనం చేసిన చిరంజీవి దంపతులు.
1.తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో సమావేశం
2.జగన్‌తో కలిసి భోజనం చేసిన చిరంజీవి దంపతులు
3.సైరా సినిమా చూడాలని కోరిన చిరంజీవి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి దంపతులు కలిశారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో సీఎంను కలిసిన చిరు.. జగన్‌ను శాలువాతో సత్కరించారు. చిరంజీవిని ఏపీ సీఎం కూడా శాలువాత సత్కరించారు.

జగన్‌తో పాటూ ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా ఉన్నారు. అనంతరం జగన్, మెగాస్టార్ దంపతులతో భోజనం చేశారు.
అనంతరం ఇద్దరూ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.. ఈ సందర్భంగా చిరంజీవి తాను నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా చూడాలని జగన్‌ను కోరారు.
అంతకముందు హైదరాబాద్ నుంచి విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న చిరంజీవి దంపతులకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
తర్వాత చిరంజీవి దంపతులు విజయవాడలోని తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు.
కొద్దిసేపు అక్కడి గడిపి.. అనంతరం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్‌కు చేరుకొన్నారు.
అంతేకాదు చిరు వెంట మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా జగన్‌ను కలుస్తారని ప్రచారం జరిగినా.. ఆయన ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు.
స్వాతంత్ర్య పోరాటయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సైరా నరసింహారెడ్డి సినిమా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది.
మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా.తన నటనతో ఆకట్టుకున్నారు. సైరా నరసింహారెడ్డి సినిమాకు ప్రముఖుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. సినిమా కూడా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.