బిగ్ బాస్ కౌశల్ ఔదార్యం.. వీర జవాన్లకు విరాళం

బిగ్ బాస్ ఫ్రైజ్ మనీ రూ.50 లక్షలను క్యాన్సర్ పేషెంట్లకు విరాళంగా ప్రకటించి ఔదార్యం చాటుకున్న కౌశల్.. పుల్వామా ఉగ్రవాద దాడిలో అమరులైన సీఆర్ఫీఎఫ్ జవాన్ల కుటుంబాలకు ఆర్ధికసాయాన్ని అందించారు.
బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ మరోసారి తన మంచి మనసుని చాటుకున్నాడు. బిగ్ బాస్ ఫ్రైజ్ మనీ రూ.50 లక్షలను క్యాన్సర్ పేషెంట్లకు విరాళంగా ప్రకటించి ఔదార్యం చాటుకున్న కౌశల్..
పుల్వామా ఉగ్రవాద దాడిలో అమరులైన సీఆర్ఫీఎఫ్ జవాన్ల కుటుంబాలకు ఆర్ధికసాయాన్ని అందించారు.
మంగళవారం ఉదయం కౌశల్ తన సతీమణి నీలిమతో కలిసి హైదరాబాద్ ఐజీని కలిసి సైనికుల కుటుంబాలకు రూ. 50 వేల చెక్‌ని అందించారు.
పోలీసుల సమక్షంలో ఉగ్రమూకల దాడిలో అమరులైన సైనికుల ఫొటోలకు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ (KAF)కి విరాళాలు అందించాలని.. వాటిని జవాన్ల కుటుంబాలను అందచేస్తానని ఫేస్ బుక్ ద్వారా కౌశల్ ఆర్మీ సభ్యులకు పిలుపునిచ్చారు కౌశల్.
తొలి నుండి సామాజిక సేవలో ముందుండే కౌశల్.. బిగ్ బాస్ సీజన్ 2 తరువాత తన కార్యక్రమాలను మరింత వేగవంతం చేశారు.
కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ (KAF) సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల తిత్లీ తుఫాను సమయంలోనూ స్వయంగా శ్రీకాకుళం వెళ్లి సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్ని చేతనైన సాయం చేశారు.