ఆమె జంతువుల సంరక్షణ కోసం “బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్”ని ఏర్పాటు చేసింది. అలాగే సామాజిక సేవా రంగంలో రైతులకు అండగా నిలిచిన అక్కినేని అమల…

నాగార్జునని పెళ్లి చేసుకున్నాక సినిమాలకు పుల్ స్టాప్ పెట్టేశారు అమల అక్కినేని. ఆ తర్వాత నుంచి ఆమె సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ప్రముఖ సినీనటి, బ్లూక్రాస్ హైదరాబాద్ కో ఫౌండర్ అక్కినేని అమల రైతుల పట్ల నిజమైన దాతృత్వాన్ని చాటుకున్నారు.
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో సర్పంచి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో 650 మంది రైతులకు ఉచితంగా కంది విత్తనాలను అందజేశారు.
ఒక్కో రైతుకు సుమారు 4కిలోల విత్తనాలను పంపిణీ చేసి వారిలో ఆనందాన్ని నింపారు.
ఈ సందర్భంగా అమల మాట్లాడుతూ… సేంద్రియ వ్యవసాయ విధానంలో పంటలు సాగుచేయాలని రైతులకు సూచించారు.
ఈ విధానంపై రైతులు ఆసక్తితో ముందుకు వస్తే నిపుణులైన శాస్త్రవేత్తలను పాపిరెడ్డిగూడకు పిలిపించి అవగాహన కల్పించనున్నట్లు అమల పేర్కొన్నారు.
అదేవిధంగా ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని అమల ఆకాంక్షించారు.
అమల ప్రముఖ హీరో నాగార్జున సతీమణి అన్న విషయం మనకు తెలిసిందే. 1992లో వీరి వివాహం జరిగింది.
ఎప్పుడైతే నాగార్జునని పెళ్లి చేసుకున్నారో.. అప్పటి నుండి అమల తన సినీ కెరీర్‌కి ఫుల్ స్టాప్ పెట్టడం గమనార్హం. ఈ క్రమంలో ఆమె నాగార్జునకి అన్ని విషయాల్లోనూ వెన్నెముకగా నిలిచింది.
ఆ సమయంలోనే ఆమె జంతువుల సంరక్షణ కోసం “బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్”ని ఏర్పాటు చేసింది. అలాగే సామాజిక సేవా రంగంలో కూడా అమల తనదైన పాత్రను పోషిస్తోంది.