మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశే”ఖర్ రెడ్డి జీవితం ఆధారంగా నిర్మించిన” యాత్ర ” సినిమా దర్శకుడు మహీ రాఘవ ముచ్చట్లు*

మహానటి తర్వాత తెలుగు చిత్రసీమలో బయోపిక్ ల ట్రెండ్ కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి’ జీవితగాధను “యాత్ర” సీనిమాగా తెరకెక్కింది. వైయస్ పాత్రలో ప్రముఖ నటుడు ‘ముమ్మట్టి’ నటించారు.
ఫిబ్రవరి 8న యాత్ర ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కేవలం పాదయాత్రకు సంబంధించిన విషయాలే కాదు. కొన్ని ఘట్టాలు సినిమాలో ఉంటాయి.
ప్రేక్షకులు ఎప్పుడూ ఒకరి సమాచారం తెలుసుకోవడానికి సినిమాకి రారు వినోదం కోసం భావోద్వేగ అనుభూతి కోసం వస్తారు.
అందుకు వైయస్ జీవితంలోని పాదయాత్ర కష్టమైనా సరైనది అనిపించింది.

అయినా మిగతా జీవితాన్ని పెంచల్ దాస్ పాడిన పాటలో చూపించే ప్రయత్నం చేశాo. ఉద్దేశం పూర్వకంగా తీసిన సినిమా కాదిది.
ఆటోలో వెళ్తున్నప్పుడు, సామాన్య ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వైఎస్ గురించి మంచి మాటలు వినిపించేవి.
ఈ సినిమా పోస్టర్లు సిద్ధమయ్యాక పాదయాత్రలో ఉన్న జగన్ను కలిసి ఈ చిత్రం గురించి చెప్పాను. టీజర్ ని విడుదల చేశాక ఆయన కలిస్తే బాగుందని. సినిమా చూస్తారా అని అడిగితే, మీ నాయకుడు కథను మీరు చెప్పారు నేను చూసి నా పేరు చెబితే సృజనాత్మకంగా సినిమా దెబ్బతింటుంది కదా అన్నారు.
ఆపదలో కరువు లేకుండా వినయంతో కనిపించే నటుడు కావాలనుకున్నా అందుకు ముమ్మట్టి అయితేనే కరెక్ట్ అనిపించింది.
సినిమా ఎన్నికలను ప్రభావితం చేస్తుంది అంటే నేను నమ్మను. ఎవరికి ఓటు వేస్తే ఎలాంటి లాభం ఉంటుందో ప్రజలు లెక్కలేసి మరీ చెబుతున్నారు.
సినిమా వల్ల అదనంగా రెండు మూడు ఓట్లు కూడా రావ్ అనుకుంటా. ఒకవేళ వస్తే మంచిదే. జగన్ కి సంబంధించిన కొన్ని నిజమైన దృశ్యాలు ఉంటాయి అంతే.
చంద్రబాబు నాయుడు పాత్ర సినిమాలో ఉండదు. ఒకే తరహా సినిమాలు ఒకేసారి విడుదల అయితే అది ఆసక్తికరంగా మారుతుంది ,అది రెండు సినిమాలకి మంచిదే.
నాకు తెలియని విషయాలను సేకరించి ఈ సినిమా చేశా. చాలా విషయాల్లో ఇది నా తొలి సినిమా అన్న అనుభూతిని కలిగించింది.
తదుపరి సినిమా ఫలితాన్ని బట్టి ఉంటుంది.
తప్పక యాత్ర విజయాత్ర కావాలని కోరుకుంటున్నాం.