యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ( వైఎస్ఆర్ పార్టీ)…9 వ వార్షికోత్సవం…

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని 9 వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.

జగన్ సొంత పార్టీ పెట్టుకుని 8 సంవత్సరాలు పూర్తయ్యాయి 9 వ సంవత్సరంలోకి అడుగు పెట్టి వార్షికోత్సవం జరుపుకోవడం ఒక విశేషమైతే, ఇదే సమయంలో ఎన్నికల ప్రక్రియ మొదలు కావడం మరో విశేషం.

ఈ నవ వసంతం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో పెద్ద పరీక్షని ఎదుర్కొనబోతోంది. రానున్న మరో నెల రోజుల్లో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనబోతోంది.

ఈ నేపథ్యంలో లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి నవవసంతం రావడం మరో విశేషం. రాబోయే వసంత ఋతువులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నవ వసంత శోభ తెస్తుందా… వేచి చూడాల్సిన అంశం.

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ 12 మార్చి 2011 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆవిర్భవించింది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త పార్టీకికి శ్రీకారం చుట్టారు.

కాంగ్రెస్ తో విభేదించి వైఎస్సార్ ఆశయ సాధన కోసం అంటూ వైసీపీని తీసుకొని వచ్చారు.

ఇడుపులపాయలో వైయస్సార్ పాదాల చెంత, ఉవ్వెత్తున తరలివచ్చిన అభిమానుల మధ్య, వైయస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మతో కలిసి పార్టీకి శ్రీకారం చుట్టారు.

పార్టీ ఆవిర్భవించిన తరువాత వచ్చిన ఉప ఎన్నికలలో వైసిపి విజయ దుందుభి మ్రోగించింది.

రాష్ట్ర విభజన తరువాత 2014 సార్వత్రిక ఎన్నికలలో మొత్తం ప్రాంతీయ పార్టీల్లో ఒంటరిగా అధిక శాతం ఓట్లను సాధించింది.

ఎన్నికలలో అత్యధిక సీట్లు గెలుచుకున్న 10 పార్టీల లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా స్థానం సంపాదించుకుంది.

ఆంధ్రప్రదేశ్లో 67 అసెంబ్లీ స్థానాలను తొమ్మిది లోక్సభ స్థానాలను గెలుచుకుంది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా కీలక పాత్ర పోషించింది.

దశలవారీగా తన సత్తా చూపిస్తూ వస్తోంది వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొదట ఆయన తల్లి మాత్రమే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంతంగా పోటీ చేసి విజయం సాధించారు.

తరువాత 18 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ జగన్ కోసం కాంగ్రెస్ కు రాజీనామా చేసి బయటకు వచ్చారు. 16 మంది ఘన విజయం సాధించి సభలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటారు.

పదేళ్ల కిందట ఎన్నికలలో దగ్గరగా వచ్చి జగన్ పార్టీ ప్రతిపక్షంతో ఆగిపోయింది. కేవలం ఒకటిన్నర శాతం ఓట్ల తేడాతో ప్రతిపక్ష పార్టీగా మారింది.

వైయస్ జగన్మోహన్ రెడ్డి ది ఒంటరి పోరు.

ప్రత్యర్థులు అందరూ మూకుమ్మడిగా వచ్చిన స్వల్ప తేడాతో బయటపడ్డారు. ఈ ఐదేళ్లలోనే కాదు. జగన్ చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

కేంద్రంలోని నియంత పాలనను మరియు రాష్ట్రంలో చంద్రబాబు కుటిల రాజకీయాలను దీటుగా ఎదుర్కొని నిలబడ్డారు.

పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని,

“మహానేత ఆశయాలను పథకాలను సజీవంగా ఉంచేందుకు వైయస్సార్ కాంగ్రెస్ ఆవిర్భవించిన నేటికి 9 ఏళ్లు గత ఎనిమిదేళ్లుగా ప్రజా జీవితంలో సవాళ్లు కష్టాలు నష్టాలు ఈ పార్టీని భుజస్కంధాల మీద మోసిన ప్రతి కుటుంబ సభ్యుడికి శుభాకాంక్షలు వందనాలు” అని ట్వీట్ చేసారు

సోమవారం కాకినాడలో జరిగిన సమర శంఖారావం సభలో జగన్ పార్టీ ఆవిర్భావ అని గుర్తు చేశారు. తొమ్మిదేళ్ల పాటు పార్టీ కార్యకర్తలంతా తనకు అండగా నిలిచారన్నారు. తొమ్మిదేళ్లు ప్రతిపక్షం లోనే ఉన్నాము.

అధికారంలో ఉన్నవాళ్లు మనల్ని ఎన్ని కష్టాలు బాధలు పెట్టారో తనకు తెలుసు అన్నారు.

కార్యకర్తలు ఎంతగా నష్టపోయారో బాగా తెలుసు అన్నారు. కొందరు ఆస్తులను పోగొట్టుకున్నారు. మరి కొందరు కుటుంబ సభ్యులను కూడా కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి అని గుర్తు చేశారు.

కార్యకర్తల ప్రతి కష్టాన్నీ, నష్టాన్నీ చూసానని… అందరికీ తగిలిన గాయం నా గుండెకుతగిలి నట్టే అని అన్నారు. కార్యకర్తలు తమ కుటుంబ సభ్యులు అని అన్నారు.

2014 ఓటమి తరువాత వైసీపీ మళ్లీ ఎన్నికలకు సన్నద్ధం అయ్యింది. ఈసారి తప్పకుండా విజయం సాధిస్తామని ధీమాతో ఉంది.

పాదయాత్రతో రాష్ట్ర ప్రజలతో మమేకమైన జగన్, నవరత్నాల పేరుతో కొత్త పథకాలను ప్రకటించారు.

ఎన్నికల షెడ్యూలు రావడంతో ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి తెచ్చేందుకు బలమైన అభ్యర్థులను కూడా బరిలోకి దించుతున్నారు.

మరో రెండు నెలల్లో వైఎస్ జగన్ కు ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందా… వేచి చూడాల్సిందే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *