టిడిపి నేతలు షర్మిలపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ

పోలీసులకు షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎదురుదాడికి దిగడం బాధాకరమన్నారు. షర్మిలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు కి తెలియదా అంటూ ప్రశ్నించారు. పోలీసుల విచారణలో ఆ పార్టీ వాళ్ళు కచ్చితంగా బయటకు వస్తారన్నారు. టిడిపి నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని చంద్రబాబునాయుడు బెదిరింపులకు దిగటం ఏంటని మండిపడుతున్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. షర్మిలకు అండగా ఉంటానని చంద్రబాబునాయుడు కనీసం భరోసా ఇవ్వక పోవడం బాధాకరం, ఆయన స్పందించిన తీరు దుర్మార్గం. ఇలాంటి ఘటనలే టిడిపి నేతలు ఇంట్లో వాళ్లకు జరిగితే ఇలాగే చెప్తారా? మిగతా మహిళల పరిస్థితి ఏంటి?

టిడిపి నాలుగేళ్ల పాలనలో మహిళలకు న్యాయం చేసిన ఘటన ఒక్కటైనా ఉందా? విలువలు, ప్రజాస్వామ్యం నైతిక విలువలు అంటూ మైకు మైకు ముందు చంద్రబాబు నాయుడు తెగ మాట్లాడుతారు. కానీ ఆయన ఇవేమీ పాటించారు. చంద్రబాబు అధికారం చేపట్టాక ఏపీ నేర్ ఆంధ్ర ప్రదేశ్ గా మారింది. నాలుగేళ్లలో పోలీసుల తీరే అందుకు నిర్వచనం. వైఎస్ జగన్ పై జరిగిన హత్య యత్న ఘటనలో ప్రాథమిక విచారణ జరగకుండా నే చంద్రబాబు డీజీపీ తో మాట్లాడిన తీరు శోచనీయం అంటూ వాసిరెడ్డి పద్మ టిడిపి నాయకుల పై నిప్పులు చెరిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *