మళ్ళీ పుంజుకున్న వైస్సార్సీపీ సోషియల్ మీడియా

కొద్దీ రోజుల విరామం అనంతరం ఒక్కసారిగా మళ్ళీ పుంజుకున్న వైస్సార్సీపీ సోషియల్ మీడియా.. ఇలాగే ముందు కూడా కూడా కొనసాగాలి, బీజేపీ, టీడీపీ చేస్తున్న కుల వివాదాలను,మత వివాదాలను, మార్ఫింగ్ ఫోటో లను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతున్న వైస్సార్సీపీ సోషియల్ మీడియా సైనికులకు నా అభినందనలు.

1.రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు డల్లాస్ వేదిక పైన దీపం వెలిగించలేదు అని గోల చేశారు__వారికి పక్క ఆధారాలతో సమాధానం ఇచ్చారు.

2.తిరుమల ఆర్టీసీ బస్సు టిక్కెట్ పైన వైస్సార్సీపీ అన్యమత ప్రచారము చేస్తుంది_ఆ టిక్కెట్లు ఎప్పుడు ముద్రణ అయ్యాయి,ఎవరి హయాంలో ముద్రించబడ్డాయి,ఎవరికి కాంట్రాక్టు ఇచ్చారు ,ఇలా అన్ని వివరాలతో వాళ్ళ నోళ్లు మూయించారు.

3.రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి పైన వ్యక్తిగత వ్యాఖ్యలు, మంత్రి పైన కుల దూషణ __ఆ పేయిడ్ ఆర్టిస్ట్ ని అరెస్టు చేయడం, అసలు అతను ఎక్కడ నుండి వచ్చాడు, ఎందుకు ఆ వీడియో చేశారు ఇలా అన్ని వివరాలు బయట పెట్టి పచ్చ కుట్రల చరిత్ర బయట పెట్టారు.

4.అంగన్వాడీ కార్యకర్తల పైన దాడులు అంటూ ద్రుష్పచారం__ఎక్కడో జరిగిన ఫోటోలు తెస్తే అవి మన రాష్ట్రంలో జరిగినవి కాదు అని చెప్పడం జరిగింది.

5.తిరుమల కొండ పైన చర్చి అంటూ పచ్చ కుక్కల పిచ్చి ప్రచారం__ఆధారాలతో తిప్పి కొట్టడం జరిగింది.

6.రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎక్కడో అంగన్వాడీ ఉద్యోగులపైన జరిగిన ఫొటోస్ చూపిస్తూ ట్వీట్ చేయడం_అది తప్పు అని తెలుసుకొని ట్వీట్ డిలీట్ చేయడం.

7.లోకేష్ బాబు పడవ అడ్డు పెట్టి వరదలు సృష్టించారు అని మాట్లాడటం_ఆ బోటు ఎవరిదో కూడా తెలియ చెప్పడం జరిగింది.

ఇలా బీజేపీ వాళ్ళు,టీడీపీ వాళ్ళు విమర్శలు చేస్తుంటే ఆధారాలతో తిప్పి కొట్టడం అద్భుతం..కానీ ఇలా ఎన్ని రోజులు వారి విష ప్రచారాలకు మనకు జవాబులు చేయాలి, వీటికి అడ్డు,అదుపు లేదా???

విమర్శలు ఉండాలి, ఆ విమర్శలకు స్పందించి, సమాధానం ఇవ్వాలి, అది ప్రభుత్వ భాద్యత.. అలా అని అనవసర విమర్శలు చేస్తే వారిపైనే చర్యలు తీసుకోవాలి.. విమర్శలు కూడా మంచి వాతావరణం లో ఉండాలి.

వీటన్నిటికీ మించి మన ముందున్న గొప్ప లక్ష్యం
ప్రజా సంక్షేమ ప్రభుత్వం లో అర్హులైన అందరికి పథకాలు అందేలా చేయడం, ఎక్కడైనా తప్పులు జరిగితే ఆ తప్పులను ఒక పద్దతి ప్రకారం పార్టీ అధినాయకత్వం కి చేరేలా చూడాలి, తప్పులు చేసుకుంటూ పోతే మనకి కూడా విలువ ఉండదు అన్న విషయం గ్రామ స్థాయి నాయకుల/కార్యకర్తల నుండి రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ గుర్తు పెట్టుకోవాలి, అప్పుడే జగనన్న కష్టానికి, ప్రజా ప్రభుత్వం కి విలువ ఉంటుంది.

ఇక చివరిగా ప్రభుత్వం పైన, ప్రభుత్వ అధికారులపైన తప్పుడు ఆరోపణలు చేసే వారి పైన ,మత వివాదాలు, కుల వివాదాలు సృష్టించే వారి మీద వెంటనే చర్యలు తీసుకోవాలి, ఒక వేళ వాళ్ళు చేసిన ఆరోపణలు నిజం అయితే అందుకు భాద్యులైన వారి పైన తగిన చర్యలు తీసుకోవాలి..

అందరూ కలిసి రాష్ట్ర అభివృద్ధికి పోరాడండి కానీ అందరూ కలిసి రాష్ట్ర పరువుని మాత్రం తీయవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *