చెల్లని చెక్కులు ఇచ్చారని…వైసీపీ ఎమ్మెల్యేకు అరెస్ట్ వారెంట్…

వైసీపీ ఎమ్మెల్యేపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్టు. ఎమ్మెల్యే ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ కావడంతో బాధితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తనకు చెల్లని చెక్కులు ఇచ్చారని.. న్యాయం చేయాలని కోరారు.


1.గతంలో ఒంగోలుకు చెందిన వ్యక్తికి చెక్కులిచ్చిన ఎమ్మెల్యే
2.చెక్ బౌన్స్ కావడంతో కోర్టును ఆశ్రయించిన బాధితుడు
3.కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ

వైసీపీకి చెందిన చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్ బాబుకు షాక్ తగిలింది. చెల్లని చెక్ కేసులో ఒంగోలు కోర్టు ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

చెక్ కేసు విచారణలో భాగంగా.. ఎమ్మెల్యే కోర్టు వాయిదాలకు వరుసగా హాజరుకానందుకు ఒంగోలు సంచార న్యాయ స్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే బాబుపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

ఎం.ఎస్ బాబు గతంలో ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తికి చెక్కులు ఇచ్చారట. కానీ ఆ చెక్కులు బౌన్స్‌ కావడంతో బాధితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తనకు చెల్లని చెక్కులు ఇచ్చారని.. న్యాయం చేయాలని కోరారు.

ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు వాదనలు వింటోంది. కానీ బాబు మాత్రం విచారణకు గైర్హాజరవుతుండటంతో కోర్టు సీరియస్‌గా స్పందించింది.

ఎమ్మెల్యేపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా.. ఈ వారెంట్ వ్యవహారంపై ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.

ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా.. ఈ వారెంట్ వ్యవహారంపై ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *