యువత అన్ని రంగాల్లో ముందు ముందుకు రావాలి వై సీపీ నగర అధ్యక్షులు మళ్ల విజయప్రసాద్

విశాఖపట్నం స్థానిక 41 వ వార్డు ఐటిఐ జంక్షన్ ఊర్వశి కూడలి కాయిత పైడీయ్య కల్యాణమండపంలో వైఎస్ఆర్ సీపీ యువజన విభాగం ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. విశాఖ వైఎస్ఆర్ సీపీ నగర అధ్యక్షుడు మళ్ల విజయ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ ములో ఉన్న యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యూవత ప్రతి రంగంలోని ముందుండి అన్ని విషయాల్లో పోటీపడాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. యువతరం అన్ని రంగాల్లో ముందుండి రానున్న రాజకీయాలకు ఆసరాగా ఉండాలన్నారు. దేశ రాజకీయాల్లో యువత చాలా కీలకమన్నారు. ప్రస్తుత పాలకులు యువతను విస్మరించి బాబొస్తే జాబ్ వస్తుందని నమ్మ పలికి యువతకు వెన్నుపోటు పొడిచారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

రానున్న రోజుల్లో యువత అధికార పార్టీకి బుద్ధి చెబుతారని సందర్భంగా అన్నారు. నాటి పాలకులు అవినీతినే మంత్రంగా భూకబ్జాలు దోపిడీలు వ్యవస్థలు ను నిర్వీర్యం చేసి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పుడు హామీలను పక్కనపెట్టి ఆంధ్ర ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి నడ్డి విరిచారని ఆయన ఎద్దేవా చేశారు.

పథకాల పేరుతో ఎన్నో కోట్ల రూపాయలు ఆర్జించి పచ్చ చొక్కాలు వేసుకున్న నాయకులకి తప్ప ఆ పథకాలు వేరొకరికి ఏ విధంగా కూడా ఉపయోగం లేకుండా ఉన్నాయని అన్నారు. గడిచిన నాలుగున్నరేళ్లలో 600 వరకు చంద్రబాబు ఎలక్షన్ మ్యానిఫెస్టులో హామీలుచ్చారు. వాటిని ఇప్పుడు మరిచి తుంగలో తొక్కారని చంద్రబాబు ముఖ్యమంత్రి ఆయన తరువాత మొదటి సంతకం డాక్రా రుణ మాఫీ చేశామని డబ్బా కోరుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదల సొంతింటి కల నెరవేరుస్తామని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నగర వైఎస్ఆర్సిపి యూత్ అధ్యక్షుడు కొండ రాజీవ్గాంధీ వెస్ట్ యూత్ కన్వినర్ గేదెల రామణ, ప్రచార కమిటీ అధ్యక్షుడు బి ఎస్ కృష్ణ, వాణిజ్య విభాగం అధ్యక్షుడు బాకీశ్యాం కుమార్ రెడ్డి, 41వ వార్డు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ముర్ర వాణి , నానాజీ మాజీ కార్పొరేటర్ జియ్యని శ్రీధర్ చెంగల ఈశ్వరరావు, కిరణ్ రెడ్డి,దోడ్డి సతీష్ , మరియు మహిళా పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *