వస్తున్నాయ్.. వస్తున్నాయ్.. జగన్నాథ రథ చక్రాలు…

వస్తున్నాయ్.. వస్తున్నాయ్.. జగన్నాథ రథ చక్రాలు: విజయసాయి ట్వీట్
ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్సీపీ ఆధిక్యం కనబరుస్తోంది. దీంతో ఆ పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నాయి. జగన్ పార్టీ ఆధిక్యంలో ఉన్నవేళ ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు.

1.ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్సీపీ ఆధిక్యం కనబరుస్తోంది.
2.దీంతో ఆ పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నాయి.
3.జగన్ పార్టీ ఆధిక్యంలో ఉన్నవేళ ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు.

ఏపీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న వేళ.. ప్రారంభం నుంచే వైఎస్ఆర్సీపీ ఆధిక్యం కనబరుస్తోంది. 128 స్థానాల్లో ఫ్యాన్ ప్రభంజనం కనిపిస్తోంది. అధికార టీడీపీ 30 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది.

సీఎం సొంత జిల్లా చిత్తూరులోనూ వైఎస్ఆర్సీపీ ఆధిక్యంలో ఉంది. ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ జగన్ పార్టీకి అనుకూలంగా ఉండటంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంబరాలను ప్రారంభించాయి. ఫ్యాన్ ప్రభంజనం గురించి.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

‘వస్తున్నాయ్… వస్తున్నాయ్‌ జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయ్‌.

కష్ట జీవులకు, కర్షక వీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ, పొలాలనన్నీ హలాల దున్నీ హేమం పండించి…

జగానికంతా సౌఖ్యం నింపేందుకు జగనన్న రథ చక్రాలు భూమార్గం పట్టాయి.

కుహనా పార్టీ పునాదులు కూకటి వేళ్ళతో కదిలిపోతున్నాయి’ అంటూ శ్రీశ్రీ కవితను విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

‘చంద్రబాబు, కిరసనాయిలు, లగడపాటి చెబ్తున్న అర్థం లేని లాజిక్ లేమిటంటే సూర్యుడు తూర్పున ఉదయించాలని ఏమీ లేదన్నట్టుగా ఉంది.

పీడ కలల్లో మునిగిన మీకు తెల్లారిన విషయం కూడా తెలియడం లేదు. మీ శకం ముగిసింది. నిజమైన ప్రజాస్వామ్యం చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ప్రభవించింది’ అని విజయసాయి మరో ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *