క్రమశిక్షణ కమిటీ లేదు..సీఎం జగన్‌కు మరో లేఖ రాశారు ఎంపీ రఘురామకృష్ణంరాజు!

ఎంపీ రఘురామకృష్ణంరాజు వైసీపీ షాక్!
శుక్రవారం లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాను వైఎస్సార్‌సీపీ ఎంపీలు, న్యాయనిపుణులు కలవనున్నట్లు తెలుస్తోంది.

రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను ఎంపీలు కోరనున్నారు.

ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం ఏపీలో కాకరేపుతూనే ఉంది. షోకాజ్ నోటీసులకు రిప్లై.. అధినేత జగన్‌కు లేఖతో హీట్ పెంచారు.

అంతేకాదు ఢిల్లీ పర్యటనకు వెళ్లి లోక్‌సభ స్పీకర్.. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, కిషన్ రెడ్డిలను కలిశారు.

దీంతో రాజకీయం మరింత వేడెక్కింది. ఈ పరిణామాలను గమనించిన వైఎస్సార్‌సీపీ అధిష్టానం రఘురామ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది.

ఎంపీలకు స్పీకర్‌ అపాయింట్‌మెంట్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరంతా ప్రత్యేక విమానంలో న్యాయనిపుణులతో ఎంపీలు ఢిల్లీకి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

శుక్రవారం మధ్యాహ్నం తర్వాత స్పీకర్‌ను ఎంపీలు కలవబోతున్నారని తెలుస్తోంది. ఎంపీలు స్పీకర్‌ను కలుస్తారన్న వార్తలతో రాజకీయం మళ్లీ వేడెక్కిందనే చెప్పాలి. రఘురామ కూడా ఢిల్లీలోనే ఉండటం ఆసక్తికరంగా మారింది.

ఘురామకృష్ణంరాజు సొంత పార్టీ నేతలపై, ప్రభుత్వం చేసిన వ్యాఖ్యల్ని అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది.

వారంలోగా సమాధానం ఇవ్వాలని షోకాజ్ నోటీసులు పంపారు. కానీ ఆయన మాత్రం సమాధానం కాకుండా రిప్లై అంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఏకంగా పార్టీకే టెండర్ పెట్టారు.. అలాగే క్రమశిక్షణ కమిటీ లేదన్నారు. అలాగే సీఎం జగన్‌కు మరో లేఖ రాశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *