వైయస్సార్ అధినేత జగన్ ధైర్యంగా ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు


వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఎప్పుడు క్లారిటీ గా ఉంటారు, పార్టీ నిర్ణయాలు, ఎన్నికల హామీలు, ప్రకటనల విషయంలో ఆయన చాలా క్లారిటీ గా ఉంటారు అనేది వాస్తవం.

ప్రస్తుతం మరో మూడు మాసాల్లో రాష్ట్రంలో సంచనాలకు వేదిక కానున్న ఎన్నికలు జరగనున్నాయి.

అయితే ఈ ఎన్నికల విషయంలో అధికార టిడిపి కన్నా విపక్షం వైఎస్సార్సీపీ అధినేత జగన్ చాలా ధైర్యంగా ఉన్నారనిఅనిపిస్తుంది.

అభ్యర్థులు ఎంపిక నుంచి, ఎన్నికల వ్యూహం వరకు, పథకాల ప్రకటన నుంచి వాటిని ప్రజల్లోకి తీసుకు వెళ్లే వరకు కూడా జగన్ క్లారిటీ గా ఉంటారని ప్రచారం జరుగుతుంది.

తాజాగా ఈ విషయంపైనే జగన్ స్పందించారు. తన వ్యూహం ఏమిటో అయినా చెప్పుకొచ్చారు.

వచ్చే ఎన్నికల్లో తాను ఒంటరిగానే పోటీ చేస్తానని వెల్లడించారు.

ఏ పార్టీతోనూ పొత్తులు అవసరం లేదని స్పష్టం చేశారు. బాబు, పవన్ లు నిజానికి ఇప్పుడు ఏపీ లో ఉన్న పరిస్థితుల్లో ప్రతి పార్టీ కూడా పొత్తు లుతోనే రాజకీయాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తోంది.

జనసేన అధినేత పవన్ పైకి పొత్తులు లేవని చెబుతూనే సంస్థాగతంగా చాలా బలంగా ఉన్న కమ్యూనిస్టులతో కలిసి ఆయన ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు.

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా అదే పంధా నూఅనుసరిస్తున్నారు.

బద్ధశత్రువైన కాంగ్రెస్ తో కలిసి ముందుకు సాగుతున్నారు.

అయితే ఏపీలో పొత్తుపై మాత్రం ఇంకా తుది నిర్ణయం లేనప్పటికీ. ఇన్నేళ్ల రాజకీయ అనుభవంతో చంద్రబాబు కూడా పొత్తు లేకుండా ఎన్నికలనుఎదుర్కోలేని పరిస్థితి.

దీంతో రాజకీయంగా జగన్ చేసిన ప్రకటన సంచలంగా మారింది. గత ఎన్నికల సమయంలో ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లి అధికారాని దూరం చేసుకున్నారని వ్యాఖ్యలు జోరుగా వినిపించాయి.

ఇక ఇప్పుడు పవన్ కలిసి వస్తున్న కేవలం టిక్కెట్లు సర్దుబాటు విషయంలో ఆయనకు జగన్ కు సరిపోలేదని అందుకే ఒంటరిగా పోరుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు.

కానీ రాష్ట్రంలో గతానికి భిన్నంగా రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. జిల్లాలకు జిల్లాలు కులాలు, వర్గాల ప్రతి పదికగా మారి పోయిన నేపథ్యంలో జగన్ మరో సారి ఆలోచించి చేస్తే బెటర్ అని అంటున్నారు విశ్లేషకులు.

జగన్ తన నిర్ణయాన్ని ఫైనల్ అంటారొ లేక ఆలోచిస్తారో చూడాలి. వైసిపి లోని కొందరు నాయకులు ఎన్నికల తర్వాత పొత్తు ఉంటుందని సంకేతాలు పంపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *