కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవబోతున్న వైసీపీ అధినేత జగన్, త్వరలోనే డిల్లీ బాట!

గత ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ లో వెనుకబడడం వల్లే స్వల్పమే తేడాతో ఓటమి పాలైన భావిస్తున్నారు వైసీపీ అధినేత జగన్.

ఈసారి పార్టీ గెలుపు బాటలో అడ్డంకిగా మారే అవకాశాన్ని కూడా వదిలిపెట్టను అని నిర్ణయించుకున్నారు.

ఏపీలో ఓట్ల గల్లంతుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.

ఏపీ లో భారీ ఎత్తున ఓట్లు గల్లంతయ్యాయని గత కొంతకాలంగా ఆరోపిస్తున్న వైసీపీ నేతలు ఇదే విషయాన్నికేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నారు.

ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి పలుమార్లు వైసీపీ నేతలు ఈ విషయం మీద ఫిర్యాదు చేశారు. అయినా ఓట్ల తొలగింపు ఆగలేదు.

దీనికితోడు సర్వేల పేరుతో వందల సంఖ్యలో కాంట్రాక్టు సిబ్బంది ఇంటింటికి ఆయా నియోజకవర్గాల్లో తిరుగుతూనే ఉన్నారు.

ఇదే పరిస్థితి కొనసాగితే నోటిఫికేషన్ వచ్చాక పరిస్థితి మరింత ప్రతికూలంగా మారే అవకాశం ఉంది అని వైసీపీ అధినేత ఆందోళన చెందుతున్నారు.

ఈ విషయం మీద తెలంగాణ సీఎం కేసీఆర్ సూచనల మేరకే జగన్ ముందు జాగ్రత్తగా ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్తున్నారు.

ఈ ఓట్ల గల్లంతు వ్యవహారాన్ని చూసి చూడనట్లుగా వదిలేస్తే బహుముఖ పోటీ నేపథ్యంలో వందల ఓట్ల తేడాతో చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు ఓటములు ప్రభావితం చేస్తే చిక్కులు తప్పవు.

అందుకే ఈ విషయాన్ని సిఇసి సునీల్ కుమార్ అరోరా దృష్టికి ఓట్లు గల్లంతు తో పాటు సర్వే ముసుగులో సాగుతున్న ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని కూడా జగన్ తీసుకెళ్తున్నారు.

గత కొన్నేళ్లుగా టీడీపీ ప్రభుత్వ హయాంలో 8వేల మంది బూత్ లెవెల్ అధికారులను నియమించారు.

ఆ అధికారులు టిడిపి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం ఉన్న వారని వైసిపి అభిప్రాయపడుతోంది.

ఈ సందర్భంగా మొన్నటి విజయనగరం సర్వే వ్యవహారంలో వైసీపీ నేతలు అంతర్గతంగా చేపట్టిన విచారణలో పలు చోట్ల బూత్లెవల్ అధికారులు ఫోన్ నెంబర్లు వంటి వివరాలు కూడా ప్రభుత్వం వద్ద అందుబాటులో లేవని తేలింది.

దీన్ని అడ్డుకోకపోతే పోలింగ్ నాటికి తెలంగాణ లోలానే లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతవుతాయని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

అందుకే సి ఈ సీ తో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం ఒత్తిడి పెంచాలని వైసిపి భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *