వైఎస్ వివేకా కూతురు సునీతకు… హత్య చేసింది ఎవరో తెలుసు ?

ఇంట్లో జరిగిన హత్య ఇంటి దొంగలే చేసారని పరమేశ్వరరెడ్డి చెప్పారన్నారు. వైఎస్ వేకానందరెడ్డి చనిపోయాడని ఫీజర్ ఇంటి ముందు పెట్టిన తర్వాత వివేకాను ఆసుపత్రికి తీసుకెళ్ళారని ఆరోపించారు వర్ల రామయ్య.

ఉండవల్లిలో ప్రజావేదిక వద్ద తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శ వర్ల రామయ్య విలేకర్లుతో మాట్లాడుతూ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైఎస్ వివేకానంద రెడ్డి మార్చి 15న జరిగిన తర్వాత సిట్ ఏమి తేల్చింది.. ? ఈ హత్యలో పాత్రదార్లు ఎవరని తేల్చారు ? హత్య జరిగి దాదాపు నలబై రోజులు అయ్యింది. కేసును ఎందుకు కోల్డ్ స్టొరేజ్ లో ఎందుకు పెట్టారు? అంటూ ప్రశ్నలు లేవనెత్తారు.

ఇంట్లో జరిగిన హత్య ఇంటి దొంగలే చేసారని పరమేశ్వరరెడ్డి చెప్పారన్నారు. వైఎస్ వేకానందరెడ్డి చనిపోయాడని ఫీజర్ ఇంటి ముందు పెట్టిన తర్వాత వివేకాను ఆసుపత్రికి తీసుకెళ్ళారని ఆరోపించారు.

ఇంటి దొంగలను ఎందుకు పట్టుకోలేకపోయారు? అంటూ వర్ల రామయ్య ప్రశ్నించారు. ఎవరి అదేశాలమేరకు ఇంటి దొంగలను అరెస్ట్ చేయలేదో సిట్ తేల్చాలని డిమాండ్ చేశారు.

అవినాష్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. ఆయనను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు వర్ల.ఆయన కాల్ డేటా తీసుకుంటే అన్ని విషయాలు బయటకొస్తాయన్నారు.

వివేకానంద రెడ్డి కుమార్తెకు సునీతకు హత్య ఎవరిచేసారో తెలుసు? అన్నారు వర్ల రామయ్య. అంతేకాదు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలిసే తెలిసే హత్య జరిగిందని ఆరోపించారు. వివేకానంద రెడ్డి కేసుపై హైకోర్టు మాట్లాడవద్దున్న సాకుతో కేసు దర్యాప్తును వదిలేస్తారా?

ఎవరు చెబితే దర్యాప్తును ఆపేసారు? ఇంటి దోంగ ఎవరో చేపాల్సిన బాద్యత ఉందంటూ వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

మాజీ మంత్రి, మాజీ ఎంపీగా పనిచేసిన వివేకానందరెడ్డి హత్యకేసును దర్యాప్తు జరపకుండా వదిలేసారా? ఇంటి దొంగలే చంపారని పరమేశ్వరిరెడ్డి, ఆతన భార్య సుగుణమ్మ చేబితే విచారణ ఎందుకు చేయడం లేదన్నారు.

జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఫోన్ డేటా తీస్తే అసలు విషయాలు బయటకు వస్తాయన్నారు. ఉత్సవ విగ్రాహాలను అరెస్టు చేసి… మూల విరాట్ లను వదిలేస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. దర్యాప్తు చేయకుండా సిట్ ఎందుకు వెనకడగువేస్తుంది? జగన్మోహన్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని, విజయసాయి రెడ్డిని ఎందుకు విచారించ లేదు? వారిని విచారించ కుండా ఎవరు అడ్డుపడుతున్నారో సిట్ సమధానం చెప్పాలి అన్నారు.

సిట్ దర్యాప్తు విషయంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు? వివేకా హత్యకు కారణమైన ఇంటిదొంగలను చట్టానికి పట్టియ్యాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని, విజయసాయి రెడ్డిని సిట్ వెంటనే విచారించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed