వైఎస్ వివేకానంద హత్యకేసును జగన్ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు :చంద్రబాబు

వివేకా హత్యకేసు.. జగన్‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఈ కేసులో వాస్తవాలు బయటకు వస్తాయనే భయంతోనే సిట్ నివేదికకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. వైఎస్ జగనే వివేకానందరెడ్డి కూతురు, భార్యతో ఫిర్యాదులు చేయిస్తున్నారు.

1.ఎంతమంది అధికారుల్ని బదిలీ చేస్తారో చేసుకోండి.
2.ప్రజా బలం టీడీపీవైపు ఉందని గుర్తు పెట్టుకోవాలి.
3.ఈ కుట్రల్ని టీడీపీ నేతలు ధైర్యంగా ఎదుర్కోవాలి.

వైఎస్ వివేకానంద హత్యకేసును జగన్ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు చంద్రబాబు. అందుకే వివేకా కూతురు, భార్యతో ఫిర్యాదులు చేయిస్తున్నారని ఆరోపించారు.

వివేకా కుమార్తె సునీతారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు పొంతన లేదని.. ఆమె జగన్ చెప్పిందే మాట్లాడుతున్నట్లు కనిపిస్తోందన్నారు.

ఈ కేసులో వాస్తవాలు బయటకు వస్తాయనే భయంతోనే సిట్ నివేదికకు అడ్డంకులు సృష్టిస్తున్నారని.. జగన్ చేస్తున్న అరాచకాలు అన్నింటికీ మోదీ వంత పాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

గురవారం పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. ఎన్నికల వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు.

ఎన్నికల్లో గెలవడం కోసం మోదీ,కేసీఆర్‌లతో కలిసి జగన్ కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ డైరెక్షన్‌లో జగన్ అరాచకాలు సృష్టిస్తున్నారని.. రాజ్యాంగబద్ధ వ్యవస్థలను ఏకపక్షంగా ప్రయోగిస్తున్నారని విమర్శించారు.

అధికారుల్ని ఇష్టం వచ్చినట్లు బదిలీలు చేస్తున్నారని.. ఎంతమంది బదిలీ చేస్తారో బదిలీ చేసుకోమంటున్నారు. ఎన్నికల్లో ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ నేతలు ధైర్యంగా ఎదుర్కోవాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు చంద్రబాబు.

టీడీపీ ఎన్నికల ప్రచార సభలకు అనూహ్యరీతిలో స్పందన వస్తుందన్నారు టీడీపీ అధినేత. ఈ సభలకు వస్తున్న జనాల్ని చూసి ప్రత్యర్ధులకు వణుకుపుడుతుందన్నారు.

పింఛన్లు పొందే వృద్ధుల్లో టీడీపీపై ఆదరణ పెరిగిందని.. పసుపు-కుంకుమ పథకంతో మహిళు అండగా నిలిచారన్నారు. ఇదే స్ఫూర్తితో అందరూ ముందుకు రావాలని.. రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నారు. శుక్రవారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని నేతల్ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed