వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గారు తెలుగు ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో మనసులోని మాటలు

వచ్చే ఎన్నికల్లో వైసీపీ 120 సీట్లు విజయం సాధించే అవకాశం ఉందని వై సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ధీమా వ్యక్తం చేశారు, పాదయాత్ర చేసిన వారంతా ముఖ్యమంత్రి అయ్యారని జగన్ కూడా సీఎం అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు, వైయస్ విజయమ్మ ఓ తెలుగు న్యూస్ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు, పాదయాత్ర ద్వారా జగన్ నాయకుడిగా ప్రజల్లో నమ్మకం కల్పించారని విజయమ్మ చెప్పారు,

అసెంబ్లీలో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు చివరివరకు ప్రయత్నించారని చెప్పారు, వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని ఆమె గుర్తు చేశారు, ఈ విషయమై అసెంబ్లీ కంటే ప్రజల సమస్యలు ప్రస్తావి చందు గాను జగన్ పాదయాత్ర ఎంచుకున్నారని అని చెప్పారు, జైల్లో ఉన్న కాలంలో మినహా ఎప్పుడు కూడా జగన్ ప్రజల మధ్య ఉండేందుకు ప్రయత్నం చేశారని చెప్పారు, ఓదార్పు యాత్ర ప్రత్యేక హోదా రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే ఉద్దేశంతో పలు కార్యక్రమాలను నిర్వహించారని ఆమె చెప్పారు, తమ కుటుంబంలో వైయస్ రాజశేఖర్రెడ్డి వైఎస్ షర్మిల వైఎస్ జగన్ పాదయాత్ర లో నిర్వహించా,రు వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నిర్వహించిన సమయంలో రాష్ట్రంలో తీవ్రమైన కరువు సమస్యలు ఉన్నాయని చెప్పారు, వరుస కరువు కారణంగా ప్రజల సమస్యలను తెలుసుకోవాలని వారికి అండగా ఉండాలని వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ద్వారా ధైర్యం కలిగించారని విజయమ్మ గుర్తు చేసుకున్నారు, ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా జగన్ తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు ఈ క్రమంలోనే పాదయాత్ర చేశారని చెప్పారు, జగన్ పై దాడి చేసిన సమయంలో టిడిపి నేతలు చేసిన ప్రచారం తనకెంతో బాధ కలిగించిందని చెప్పారు, జగన్ పై దాడి ఘటనను తమ కుటుంబానికి కూడా అంటగట్టే ప్రయత్నం చేశారని ఆమె తప్పు పట్టారు

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏ పార్టీ ఇస్తే ఏ పార్టీతో కలిసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని విజయమ్మ చెప్పారు, వచ్చే ఎన్నికల్లో 120 సీట్లు వస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు తన అవసరం ఉందని జగన్ భావిస్తే ప్రచారం నిర్వహిస్తానని చెప్పారు వచ్చే ఎన్నికల్లో తనకు పోటీ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *