సోషల్ మీడియాలో తనపై తన కుటుంబ సభ్యులపై వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వైయస్ షర్మిల హైదరాబాద్ సీపీకి ఫర్యాదు చేశారు

వైయస్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల తనపై తన కుటుంబం పై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కు ఫిర్యాదు చేశారు. షర్మిలతో భర్త అనిల్ కుమార్ వై వి సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణా రెడ్డి వాసిరెడ్డి పద్మ వెళ్లారు.

షర్మిల మాట్లాడుతూ 2014 ఎన్నికలకు ముందు మొదలు పెట్టి నాకు ప్రభాస్ కు సంబంధం ఉన్నదని, ఓ వర్గం ఆన్లైన్లో దుష్ప్రచారం చేశారు. ఎన్నికల తర్వాత దీనిపై ఫిర్యాదు కూడా చేసాము, పోలీసులు విచారణ అనంతరం చర్యలు తీసుకోవడంతో కొంతకాలం ఈ దుష్ప్రచారం ఆగింది. కానీ మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి, కనుక ఈ విష ప్రచారానికి మళ్లీ వేగం పెంచారు. వీరి ఉద్దేశం ఒకటి నా వ్యక్తిత్వాన్ని

దెబ్బతీయడానికి. ఈ ప్రసాదాలను సృష్టిస్తున్న వారి మీద, వారి అనుకున్న వారి మీద చర్యలు తీసుకోవాలని ,కమిషనర్ కు కలిసాం. ఇది నా ఒక్క దానికే జరిగిన అవమానంగా భావించడం లేదు. ఇలాంటి రాతలు ఇంకా ఎంతో మహిళల మీద రాస్తున్నారు. స్త్రీల పట్ల ఎంత పైశాచికంగా , చులకన భావంతో రాస్తున్న రాతలను, మన సమాజం ఆమోదించవచ్చా? . ప్రజాస్వామ్యం లో మానవ హక్కులు, సమానత్వం లాంటి ఎన్నో గొప్ప గొప్ప పదాలు కాగితాలు చర్చలకే పరిమితం కాకూడదు. ఇది వాస్తవ రూపం దాల్చాలన్న మనం గొంతు ఎత్తాల్సి అవసరం ఉంది.

సోషల్ మీడియాలో వెబ్సైట్లలో ఈ ప్రచారాలకు వీల్లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు కు ప్రజాస్వామ్యవాదులు, నైతికత ఉన్న రాజకీయ నాయకులు, జర్నలిస్టులు మహిళలకు మద్దతు పలకాలని గా కోరుతున్నాం. తప్పుడు ప్రచారం చేస్తున్న వారు, తప్పుడు ప్రచారాలు చేపిస్తున్న వారు కాకుండా, నేను దోషి లా నిలబడి నా వాదనను వినిపించి కోవాల్సి

దుస్థితికి రావడం నాకే కాదు, మహిళలందరికీ ఇది అవమానకరం. ఈ తప్పుడు ప్రచారాలు మూలాలతో సహా తొలగించాలని ఉద్దేశంతో నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. నా నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు నాకోసం నాకు తెలుసు, కానీ ఈ రోజు నా గౌరవానికి కాపాడుకోవాల్సిన అవసరం నాకు ఉంది కాబట్టి మీ అందరి ముందుకు వచ్చి చెబుతున్నా.

ఈ ప్రసారాలు వెనుక టిడిపి ఉందని భావిస్తున్న టిడిపికి పుకార్లు పుట్టించే కొత్త కాదు, మా నాన్నగారు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారిని ఫ్యాక్షనిస్ట్ అంటూ పుకార్లు పుట్టించింది టిడిపి పార్టీ, తరువాత వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక, ఆయనది ఎంత గొప్ప మనసు ఎంత గొప్ప వ్యక్తిత్వం లోకమంతా చూపించింది, మా అన్న జగన్ కోపిస్తే ని, గర్విస్తాను టిడిపి పుకార్లు పుట్టించింది. కానీ ఎంత సౌమ్యుడు ఈ పాదయాత్రలో కోట్ల ప్రజలకు అర్థమైంది ఇప్పుడు నా మీద కూడా పుకార్లు పుట్టించింది టిడిపినే. స్వయంగా వీటిని చంద్రబాబునాయుడు ప్రోత్సహిస్తున్నారు.

మా నాన్న ధర్మంగానే పోరాటానికి ధైర్యం ఇచ్చారు. చంద్రబాబు లాంటి నాయకులు అధికారంలో ఉన్నంత వరకు సమాజం బాగుపడదు. ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తూ పోతే వాళ్ళు ఎక్కడా కనిపించరు. దేవుడున్నాడని గుర్తుపెట్టుకోవాలి, కమిషనర్ లతో కలిసి మాట్లాడినప్పుడు నా వ్యక్తిగత విషయం గా కాకుండా మహిళలందరూ ఆత్మగౌరవం విషయం గా పరిగణించి, దోషులను శిక్షించాలని కోరామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *