రేపు ఆధునిక భగీరధుడు, మనసున్న మారాజు, జనశేఖరుడు, రాజసం ఉట్టిపడే రాజశేఖరుడు YS వర్ధంతి సందర్బంగా!

తెలుగు CM లు అందరిలో గొప్పవాడు YS

1.2010 లో (YS చనిపోయిన సంవత్సరం తరువాత) తెలుగు ముఖ్యమంత్రుల్లో ఎవరు బెస్ట్ CM అని NTV నరేంద్ర చౌదరి అంతర్జాతీయ సంస్థ నీల్సన్ తో చేసిన సర్వేలో YS Best CM అని అని 65 శాతము మంది ప్రజలు చెప్పారు.

2.2009 ఎన్నికలు ఇంకో రెండు నెలల్లో ఉన్నాయనగా ప్రచారం ప్రారంభించటానికి ముందు సొంత ఊరు నారావారిపల్లె వెళ్లి పెద్దల ఆశీర్వదం తీసుకోవాలి అనుకున్నాడు బాబు
అప్పుడు నారావారి పల్లెలో బాబు చిన్నాన్న ఒకరు” నేను అధికారం లోకి వస్తే YS లాగా మంచి పాలన అందిస్తాను’ అని చెప్పు నాయనా అప్పుడు ప్రజలు నీకు ఓట్లు వేస్తారు అని చెప్పినట్టు ఆంధ్ర జ్యోతి రాసింది

3 .2009 లో YS గెలిచి సీఎం అయినాక అప్పటి టీడీపీ నాయకురాలు రోజా వెళ్లి YS ని కలిసింది , అప్పుడు I-News లో అంకం రవి అనే ఆయన చర్చ పెట్టాడు YS కు బాబు కు తేడా ఏమిటి అని ?

అప్పుడు చర్చలో పాల్గొన తెలంగాణ సీనియర్ BC జర్నలిస్ట్ పాశం యాదగిరి ” ఇద్దరూ రాయలసీమకు చెందిన వారు రాయలసీమ భాషలో పోల్చుతా” YS బెంగళూరు లాంటోడు అయితే బాబు పుంగనూరు లాంటోడు ,ఎన్ని పుంగనూరు లు కలిస్తే బెంగళూర్ అవుద్ది కాబట్టి YS ముందు బాబు తేలిపోతాడు, బాబు క్యారెక్టర్ చాల వీక్ అని ఆన్నాడు “2009 ఎన్నికలకు ముందు అప్పటి HMTV CEO రామచంద్రమూర్తి సర్వే చేసి మరల YS గెలుస్తాడు అని చెప్పాడు

4. ఆ సందర్బంగా YS ప్రజల మధ్య ఉంది యుధం చేస్తాడు కానీ బాబు మీడియా వెనకాల దాక్కొని యుద్ధం చేస్తాడు అని చెప్పాడు.

5.సోనియా ను ఎదురించి రాష్ట్ర విభజనను ఆపాడు YS అని మన్ మోహన్ సింగ్ మీడియా సలహాదారు సంజయ్ బారువా CNN IBN ఇంటర్వ్యూ లో చెప్పాడు .

బలమైన నాయకుడు YS చనిపోవడం, బాబు ఇచ్చిన లేఖల వల్లనే రాష్ట్ర విభజన జరిగింది ఆని ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పారు

6.ఆధునిక భగీరధుడు YS. నీటికి కటకటలాడే కరువు సీమ రాయలసీమ నుంచి వచ్చిన డాక్టర్ YS కు నీటి విలువ బాగా తెలుసు అందుకే జలయజ్ఞం పేరిట పోలవరం తో సహా అనేక ప్రాజెక్ట్ లు చేపట్టి 19 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చాడు అని YS చెప్పడం కాదు, 2014 లో బాబు CM అయ్యాక జరిగిన జరిగిన మొదటి గవర్నర్ ప్రసంగం లో చెప్పించారు బాబు. ఇది YS జలయజ్ఞానికి బాబు సర్కార్ ఇస్తున్న సర్టిఫికెట్ అని ప్రొఫసర్ నాగేశ్వర్ చెప్పారు

బ్రిటిష్ కాలం నుంచి పోలవరం కట్టాలని కలలు కన్నా YS సీఎం అయినాకే పోలవరం కు దాదాపుగా అన్ని అనుమతులు తీసుకొచ్చి 3 వేల కోట్లకు ఖర్చు పెట్టి పోలవరం కుడు కాలువ ఎడమ కాలువ తవ్వారు , ఇపుడు ఆ కాలువ ల ద్వారానే పట్టిసీమకు నీళ్లిచ్చాడు బాబు

YS కు ముందు 9 సం CM గ ఉన్నా బాబు ఏనాడూ పోలవరం గురించి ఆలోచించేంచలేదు , ఒక రూపాయి కూడా కేటాయించలేదు

7.హైదరాబాద్ ను పెపంచ పటం లో పెట్టాను అన్ని బాబు డప్పేసుకుంటాడు కానీ గత 60 ఏళ్లలో హైదరాబాద్ శర వేగంగా అభివృద్ధి చెందింది YS హయము లోనే ఆని జూన్ 27 ,2015 న JNTU శాస్త్రవేత్తలు రిపోర్ట్ ఇచ్చారు

8.ఎవరైనా సరే 5 సం పాలించిన తరవాత అధికారం లోకి వస్తే అది గొప్ప విషయమే.2004 ఎన్నికల్లో గెలవడం కంటే 2009 ఎన్నికల్లో గెలవడం నిజంగా గొప్ప విజయం YS కు.

మొదట కాంగ్రెస్ ఒప్పుకుంటే కాంగ్రెస్ తో కలిసి వెళతా ఎన్నికలకు అని KCR ఆఫర్ ఇస్తే YS నో చెప్పాడు అంత నమ్మకం తన పాలన మీద ఆయనకు.

ఒక వైపు మహాకూటమి (TDP +TRS +CPI +CPM) ,మరో వైపు సినిమా దేవుడు చిరంజీవి PRP పార్టీ పెట్టి అప్పటిదాకా కాంగ్రెస్ కు కాపుకాస్తున్న కాపు సోదరుల వోట్లను తీసుకెళ్ళినా కూడా ఒంటి చేత్తో 33 పార్లమెంటు సీట్లు గెలిపించాడు YS .TDP కి 6 TRS కు 2 MIM కు 1, PRP 0 వచ్చాయి

( 2009 ఎన్నికలు జరిగన రోజు సాయంతం చిరు ప్రెస్ మీట్ పెట్టి నేను కానీ ప్రజారాజ్యం పార్టీ పెట్టకపోయి ఉంటె కాంగ్రెస్ కు ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేయి అని చెప్పాడు

అలాగే అప్పటి NDTV సర్వే కాంగ్రెస్ కు 33 MP సీట్లు వస్తాయి కాని ప్రజారాజ్యం పార్టీకి ఒక్క MP సీటు కూడా రాదు అని చెప్పింది

చిరంజీవి పార్టీకి మొత్తం 17 శాతం వోట్లు వస్తాయి కాంగ్రెస్ నుంచి 12 శాతం TDP నుంచి 5 శాతం వోట్లు వస్తాయి అని చెప్పింది, ఫలితాలు అదే నిజం అని తేల్చింది.

కాకపోతే తన ఓటమికి చిరు కారణమని బాబు కుంటి సాకులు చెబుతాడు అదే వేరే విషయం)

9.2014 లో మోడీ పవన్ బాబు కలిసి పోటీ చేసి అనేక వాగ్దానాలు చేసినా YCP కి 45 శాతం ఓట్లు వచ్చాయంటే (టీడీపీ కూటమికి 46 .69 శాతము ఓట్లు) YS మీద ప్రజలకు ఉన్న ప్రేమే కారణం

10.YS తండ్రి రాజారెడ్డి గారిని మే 23 1998 న బాబు CM గా ఉన్నప్పుడు ప్రత్యర్ధులు చంపేశారు , 21 సం తరువాత నేటికీ రాజారెడ్డి హంతకులు బ్రతికే ఉన్నారు.
ప్రాణం పోసిన డాక్టర్ ప్రాణాలు తీయలేడు.
YS కానీ జగన్ కానీ అనుకొంటే తండ్రి హంతకులు బ్రతికుండేవారా ?

గొప్ప మనసున్న మారాజు జన రాజశేఖరుడు

ఏ అభివృద్ధి సూచిక ప్రకారం చూసినా ఆంధ్ర ప్రదేశ్ ఎక్కువగా అభి వృద్ధి చెందింది YS హయములోనే అని గణాంకాలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *