వైఎస్ జగన్ పులివెందులలో శుక్రవారం నామినేషన్ చేశారు…

వైఎస్ జగన్ నామినేషన్.. జనసంద్రమైన పులివెందుల
పులివెందుల గడ్డపై పుట్టినందుకు గర్వపడుతున్నానన్న జగన్. కష్టాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పిన గడ్డ పులివెందుల అంటూ జగన్ భావోద్వేగం. కడప జిల్లాలో టీడీపీ గెలిచే పరిస్థితి లేదనే కుట్రలు పన్నుతున్నారన్న జగన్.
1.పులివెందులలో నామినేషన్ దాఖలు చేసిన జగన్
2.భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు
3.జనసంద్రమైన పులివెందుల వీధుల
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నేతలతో కలిసి స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో.. సరిగ్గా మధ్యాహ్నం 1.49 గంటలకు తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ నామినేషన్ పత్రాలు సమర్పించే ముందు ఆయన సర్వ మత ప్రార్థనలు నిర్వహించారు. జగన్ నామినేషన్ ర్యాలీకి వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. పులివెందుల వీధులన్నీ జనసంద్రమయ్యాయి.
అంతకుముందు పులివెందుల సీఎస్‌ఐ చర్చి మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. పులివెందుల గడ్డపై పుట్టినందుకు గర్వపడుతున్నానని.. కష్టాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పిన గడ్డ పులివెందుల అన్నారు. తన బాబాయి వివేకానందరెడ్డిని దారుణంగా చంపించారని ఆరోపించారు జగన్. హత్య చేసి వాళ్లు పోలీసులతోనే విచారణ చేయిస్తున్నారని..
కడప జిల్లాలో గెలవలేమని టీడీపీ నిర్ధారించుకుందని తెలిపారు. చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఏర్పడిందని.. అందుకే కుట్రలకు తెరలేపారని జగన్ ఆరోపించారు.
నామినేషన్ వేసిన జగన్.. ఆస్తులు, అప్పుల వివరాలు..
వైఎస్ జగన్ పులివెందులలో శుక్రవారం నామినేషన్ చేశారు. అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఆయన దగ్గర రూ.340 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నాయి. భారతి పేరిట ఎన్ని ఆస్తులున్నాయంటే..
1.వైఎస్ జగన్ పులివెందులలో శుక్రవారం నామినేషన్ చేశారు.
2.అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఆయన దగ్గర రూ.340 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నాయి.
3.భారతి పేరిట ఎన్ని ఆస్తులున్నాయంటే..
వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ వేశారు. శుక్రవారం మధ్యాహ్నం 1.50 నిమిషాలకు ఆయన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్‌కు సమర్పించారు. తాను 1994లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశానని అఫిడవిట్‌లో జగన్ తెలిపారు. తన మీద 31 కేసులు ఉన్నాయని ఈ సందర్భంగా జగన్ స్పష్టం చేశారు. జగన్ సమర్పించిన అఫిడవిట్‌లో ఇంకా ఏమేం ఉన్నాయంటే..
జగన్ పేరిట దాదాపు రూ. 339.89 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా.. ఆయన భార్య భారతి పేరిట రూ. 31.59 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. కుమార్తెలు హర్షిణి రెడ్డి పేరిట రూ. 6,45,62,191 కోట్లు, వర్షా రెడ్డి పేరిట రూ. 4,59,82,372 కోట్ల విలువైన ఆస్తులున్నాయి.
తన పేరిట రూ. 35.30 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయన్న జగన్.. తన భార్య పేరిట రూ. 31.59 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయన్నారు. తనకు రూ.1.19 కోట్ల మేర అప్పులున్నాయని జగన్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.