బందరు పోర్టుపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం

బందరు పోర్టుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది… బందరు పోర్టు అభివృద్ధి ఒప్పందాన్ని రద్దు చేసింది ఏపీ సర్కార్… బందరు పోర్టు నిర్మాణం, అభివృద్ధి కోసం 2010 జూన్ 7వ తేదీన అప్పటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసింది ప్రభుత్వం.
డెవలపరుకు ఇచ్చిన 412.57 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోనున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించింది ప్రభుత్వం. దీంతో, బందరు పోర్టు నిర్మాణానికి కొత్త ఒప్పందం చేసుకోనుంది ఏపీ సర్కార్… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్ధలతోనే బందరు పోర్టు నిర్మాణం చేసే యోచనలో ఏపీ సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తోంది.
విశాఖ పోర్ట్ ట్రస్టు ద్వారా బందరు పోర్టు నిర్మాణం, నిర్వాహణ చేపట్టాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ప్రభుత్వ-ప్రభుత్వ రంగ సంస్ధలతో కన్సార్షియం ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది వైఎస్ జగన్ సర్కార్.