ఇచ్చాపురం పాదయాత్ర ముగింపు సభలో చంద్రబాబు పై పవర్ పంచలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఉపన్యాసం

పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా కేంద్రంగా ఏపీ ని చేస్తాను అని మాట ఇచ్చారు జగన్. ఇరవై ఐదు జిల్లాలతో పునర్నిర్మాణం అని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాలనలో సంస్కారం చేపడతాము అని హామీ ఇచ్చారు.
మనం ప్రభుత్వము మీ అందరి దీవెనలతో, దేవుడి దయతో మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వాళ ఉన్న 13 జిల్లాల్లో రాబోయే రోజుల్లో ప్రతి పార్లమెంట్ కు ఒక జిల్లాగా చేస్తాను అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను అన్నారు. ప్రతి పార్లమెంటు ఒక జిల్లాగా ఎందుకు చేయబోతున్నాడో తెలుసా దానికి కారణం ప్రతి కలెక్టరు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ మాత్రమే జవాబుదారిగా ఉండాలి. ఇవాళ్ళ కలెక్టర్లు అసెంబ్లీ స్థానాల్లో ఎక్కువగా ఉన్నప్పటికీ జవాబుదారీతనం లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు కలెక్టర్లు వ్యవస్థను పూర్తిగా ప్రజలకు దగ్గరగా చేర్చి అందుకు .ఈ కార్యక్రమం చేస్తున్నాము. 13 జిల్లాలు ఉన్న ఆంధ్ర రాష్ట్రం లో మొట్టమొదటిగా ,25 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గం చేస్తాము అని చెబుతున్నాను.
ఇచ్చాపురంలో పాదయాత్ర ముగింపు సభలో చంద్రబాబు పై విమర్శలు గుప్పించారు జగన్. రైతులు అంటే చంద్రబాబుకు చిన్నచూపు అని అన్నారు. కరువుతో అన్నదాతలు అల్లాడుతుంటే బాబు జాతీయ రాజకీయాలు అంటూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
ఇతను ఏం పెద్ద మనసు చంద్రబాబునాయుడు గారు ఒక రోజు బెంగళూరు వెళ్తాను అని అంటాడు కుమారస్వామితో కాఫీ తాగుతాడు. కానీ పక్కనే అనంతపురం ఉంటుంది. అనంతపురం వెళ్ళి కారువుగా ఉన్న రైతులకు అండగా ఉండాలి అని ఆలోచన మాత్రం చంద్రబాబు నాయుడు గారికి రాదు. మరునాడు అదే చంద్రబాబు నాయుడు గారు విమానం ఎక్కుతారు. జాతీయ రాజకీయాలు అంటూ చెన్నై వెళతారు చెన్నై వెళ్లి ఏం చేస్తారు స్టాలిన్ తో కలిసి ఇడ్లీ సాంబార్ తింటారు. ఈ పెద్దమనిషి స్టాలిన్ తో కలిసి ఇడ్లీ సాంబార్ తింటారు కానీ పక్కనే తన సొంత జిల్లా చిత్తూరు ఉంది. ఆ చిత్తూరులో రైతులు అల్లాడుతున్నారు అని ధ్యాస ఏమాత్రం చంద్రబాబు నాయుడు గారికి పట్టదు.
నదులు అనుసంధానం చేస్తాను అని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ నీళ్లను రాయలసీమకు తీసుకువెళ్లాను అంటారు . కానీ తీసుకురావడంలో చంద్ర బాబు గారు విక్రమ్ అయ్యారు అని చెప్పినా జగన్.
ప్రజలకు ఇంత దారుణంగా అబద్దాలు చెబుతున్నా వ్యక్తులను చూసినప్పుడు రాష్ట్ర ప్రజలుకు ,రైతున్నలు కూడా అందుకే చంద్రబాబునాయుడు గారిని అంటారు. ఏమంటారు, ఏమంటారు అంటూ ఈ బాబు ని నమ్మము అంటే నమ్మము బాబు అంటారు అని విమర్శించారు. అలాగే దళారీ దారులకు చంద్రబాబు క్యాపిటల్ అయ్యారు. అంటూ ఆరోపించారు జగన్ తన సొంత హెరిటేజ్ సంస్థకు లాభాలు కోసం రైతుల నుండి చంద్రబాబు తక్కువ ధరకు కొనుగోలు చేసి డబ్బులు రేటు అమ్ముతున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసిన చంద్రబాబు వచ్చాక ఉన్న జాబు కాస్త తీసేసారు అని మండిపడ్డారు జగన్. 3500 ఇన్స్పెక్టర్లకు, కంప్యూటర్ ఆపరేటర్ లకు ఉద్యోగాలు గోవింద అంటూ చంద్రబాబు నాయకత్వాని విమర్శించారు.
భయం పట్టుకుంది ఈ పెద్దమనిషి చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ చంద్రబాబు నాయుడు గారికి టెంపరేచర్ పెరిగిపోతుంది. చంద్రబాబు నాయుడు కి భయం పెరిగే కొద్ది ఈ మధ్యకాలంలో నోటి మాట వస్తే ఆనాటికి ఆ మాటకి కనెక్షన్ తప్పుతుంది అనే విషయం ఈ మధ్యకాలంలో మీరంతా గమనించే ఉంటారు. భయం ఎక్కువ అయ్యే కొద్ది ఎన్నికలకు మూడు నెలలు , ఐదు నెలలు ఉండేసరికి ఈ హామీలు చేస్తారు పేదలకు కొత్త ఇల్లు అంటారు,.పేదలకు కొత్త రేషన్ కార్డ్ అంటారు, కోడలుకు కొత్త పింఛన్లు ఇస్తామంటారు. అంతటితో ఆ గురు ఆదరణ 2 అంటారు. మరో స్క్రీన్ అంటారు చివరకు అన్ని స్కీములు ఏమిటో తెలుసా.
ఆయన తీస్తున్న కొత్త సినిమా ఎంటో తెలుసా ఆరు నెలలు ముందు చంద్రబాబు నాయుడు డ్రామా అని చెప్పి కొత్త సినిమా తీస్తున్నారు. అంటూ పవర్ పంచల తో ఇచ్ఛాపురం పాదయాత్ర సభలో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు వర్షం కురిపించారు జగన్మోహన్ రెడ్డి గారు.