వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 100 రోజుల పాలనలో, ఆంధ్రప్రదేశ్‌ నవశకానికి నాంది– సామాజిక విప్లవానికి సరికొత్త అడుగులు

సంక్షేమం – పధకాలు

 1. ఉద్దానం కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం– రూ. 600 కోట్లతో మంచినీటి పథకం.
 2. అవ్వా తాతలకు వృద్ధాప్య పింఛన్‌ను.. ఏకంగా రూ. 2,250కు పెంపు. ఏటా రూ. 250 పెంచుతూ రూ. 3000 వరకు పెంపు
 3. పింఛను పొందడానికి అర్హత వయసును 65 నుంచి 60కు తగ్గింపు. అదనంగా 5 లక్షల మందికి పైగా ప్రయోజనం.
 4. డ్వాక్రా మహిళలకు వైయస్‌ఆర్‌ ఆసరా పథకం ద్వారా.. అధికారంలోకి వచ్చేనాటి వరకు ఉన్న రుణాలకు సమానమైన సొమ్మును నాలుగు విడతల్లో అందజేసేందుకు నిర్ణయం.
 5. ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ళ స్థలాలు పంపిణీ.. ఆ తర్వాత ఏడాది నుంచి పక్కా ఇళ్ళ నిర్మాణం.
 6. గ్రామ స్వరాజ్యం సాధన దిశగా అడుగులు.. గ్రామ, వార్డు సచివాలయాలకు శ్రీకారం.. 4 లక్షలకుపైగా ఉద్యోగాలు.. వీటిలో శాశ్వత ప్రాతిపదికన 1లక్షా 27 వేల ఉద్యోగాలు.
 7. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా.. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్ళకు, పట్టణాల్లో ప్రతి 100 ఇళ్ళకు ఒక వాలంటీర్‌ నియామకం. వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలను, సేవలను అందించేందుకు చారిత్రాత్మకమైన నిర్ణయం.
 8. విశాఖ ఏజెన్సీలో గిరిజనుల హక్కులకు అగ్ర తాంబూలం.. బాక్సైట్‌ తవ్వకాలకు నో.
 9. పేదలకు రేషన్‌ కార్డుల ద్వారా 5,10,15 కిలోల బ్యాగుల్లో.. ప్రజలు తినే నాణ్యమైన బియ్యం పంపిణీకి శ్రీకారం.
 10. 45 ఏళ్ళు దాటిన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు కుటుంబానికి వచ్చే ఏడాది నుంచి ఆయా కార్పొరేషన్ల ద్వారా నాలుగు విడతల్లో మొత్తంగా రూ. 75 వేలు ఆర్థిక సాయం.
 11. దేశ చరిత్రలోనే మొట్టమొదటిగా పోలీసులకు వీక్లీ ఆఫ్‌.. ఇక ఫ్రెండ్లీ పోలీసింగ్‌.
 12. అవినీతి, పైరవీలకు తావు లేని ఇసుక విధానం.. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే ఇంటికి చేరనున్న ఇసుక.
 13. ప్రజల సమస్యల పరిష్కారానికి స్పందన– చిన్న చిన్న సమస్యలకు 72 గంటల్లోనే పరిష్కారం.
 14. స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలపై ప్రతి మంగళవారం ముఖ్యమంత్రి సమీక్ష– తక్షణ పరిష్కారానికి ఆదేశాలు.
 15. ప్రతి సోమ, మంగళ వారాల్లో కలెక్టర్లు, ఎస్పీలు తమ పరిధిలోని అధికారులతో భేటీ– ప్రజా సమస్యలకు పరిష్కారం.
 16. కాపు కార్పొరేషన్‌కు తొలి బడ్జెట్‌లోనే రూ. 2 వేల కోట్లు నిధులు.. 5 ఏళ్ళలో రూ. 10 వేల కోట్లు కేటాయింపునకు రంగం సిద్ధం.
 17. షాపులు ఉన్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ. 10 వేలు ఆర్థిక సాయం.
 18. ఎస్సీలు, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌ పరిమితిని 100 నుంచి 200 యూనిట్లకు పెంపు
 19. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా అడుగులు, క్యాబినెట్‌ నిర్ణయం.
 20. రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ బస్సులు నడిపేందుకు చర్యలు.
 21. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌(మధ్యంతర భృతి).
 22. ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారిన సీపీఎస్‌ రద్దుకు నిర్ణయం.
 23. అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవడం కోసం బడ్జెట్‌లో రూ. 1150 కోట్లు
 24. పారిశుధ్య కార్మికుల వేతనాలు భారీగా పెంపు.
 25. ఆశా వర్కర్ల జీతాలు రూ. 3 వేల నుంచి రూ. 10 వేలకు పెంపు.
 26. అంగన్‌వాడీ వర్కర్ల జీతాలు రూ. 10,500 నుంచి రూ.11,500కు పెంపు. అంగన్‌ వాడీ ఆయాల జీతం రూ. 6 వేల నుంచి రూ. 7 వేలకు పెంపు.
 27. డ్వాక్రా యానిమేటర్లు, రిసోర్స్‌ పర్సన్‌లకు గౌరవ వేతనం రూ. 3,000 నుంచి రూ. 10 వేలకు పెంపునకు నిర్ణయం.
 28. గిరిజన తండాల్లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్ల జీతాలు రూ. 400 నుంచి రూ. 4000కు పెంపు
 29. కడప జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు నిర్ణయం. 2019 డిసెంబరు 26న శంకుస్థాపన.
 30. చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ. 10 వేలు ఆర్థిక సాయం.
 31. సొంత ఆటో, ట్యాక్సీ నడిపేవారికి మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్‌ అవసరాల కోసం ఆర్థిక సాయం రూ. 10 వేలు.
 32. మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు సంవత్సరానికి రూ. 24 వేలు ఆర్థిక సాయం.
 33. వెయస్‌ఆర్‌ కళ్యాణ కానుక కింద.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లోని యువతులు వివాహాలకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం. బీసీ యువతుల వివాహాలకు రూ. 50 వేలు.
 34. ప్రమాదవశాత్తు పెద్ద దిక్కును కోల్పోయిన గిరిజన కుటుంబాలకు అండగా ఉండేందుకు వైయస్‌ఆర్‌ బీమా పథకం కింద రూ. 5 లక్షలు ఆర్థిక సాయం.
 35. పారిశ్రామిక పెట్టుబడుల కోసం.. అవినీతికి తావులేని, పారదర్శకమైన ఇండస్ట్రీయల్‌ పాలసీ. పెట్టుబడిదారులు ఒకే ఒక్క దరఖాస్తు చేస్తే చాలు. డిప్లమాటిక్‌ ఔట్‌రిచ్, విదేశీ పర్యటన ద్వారా పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి పిలుపు. రాష్ట్రంలో కొత్తగా మరో 4 పోర్టులు, ఎయిర్‌పోర్టులు ఏర్పాటుకు చర్యలు. అవినీతి, లంచగొండితనం లేని ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణమే లక్ష్యంగా అడుగులు..
 36. ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి పదేపదే విజ్ఞాపనలు. ఢిల్లీ పర్యటనల్లో, పార్లమెంటులో ఇదే ప్రధాన అజెండాగా కేంద్రంపై రాజీలేని పోరాటం.
 37. క్రీడాకారులకు ప్రోత్సాహకాలు– జాతీయ స్థాయిలో స్వర్ణం సాధిస్తే రూ. 5 లక్షలు. రజత పతకానికి రూ. 4 లక్షలు, కాంస్యానికి రూ. 3 లక్షలు.
 38. గోదావరి ముంపు బాధితులకు అదనంగా రూ. 5 వేలు సాయం.
 39. వివిధ ప్రభుత్వ శాఖల్లో చేసే రూ. 1 కోటి దాటిన కొనుగోళ్ళన్నింటిలో పారదర్శకత పెంచేలా ఆన్‌లైన్‌లోనే టెండర్లు. కొనుగోలు చేయాల్సిన వస్తువుల నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించి, మునుపటి రేట్ల కంటే తక్కువకు సరఫరా చేసేందుకు ఎవరైనా ముందుకు వస్తే వారికే అవకాశం.
 40. రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలు, నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు ఉండటానికి వీల్లేదని ముఖ్యమంత్రి గట్టి సంకేతాలు.
 41. పదేళ్ళ తర్వాత కృష్ణా నదికి వచ్చిన భారీ వరదలను సమర్థవంతంగా ఎదుర్కొని, ప్రాణ నష్టం లేకుండా ప్రభుత్వం చర్యలు.
 42. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో గత ప్రభుత్వం పాల్పడిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై వాస్తవాలను తవ్వితీస్తున్న ప్రభుత్వం.
 43. గత ప్రభుత్వం దోపిడీకి సంబంధించి 30 అంశాల్లో విచారణకు మంత్రులతో సబ్‌ కమిటీ ఏర్పాటు..
 44. రాష్ట్రంలో ప్రజలందరికీ పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు మూడు దశల్లో వాటర్‌ గ్రిడ్‌ పథకాలు..
 45. అక్రమ మద్యం, నాటుసారాను అరికట్టేందుకు గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులు నియామకం..
 46. మత్స్యకారులకు డీజిల్‌పై ఇస్తున్న సబ్సిడీని లీటరుకు రూ.6 నుంచి రూ. 9కి పెంపు.
 47. ముస్లింలు, క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో వెళ్ళే హజ్, జెరూసలెం యాత్రలకు ఇస్తోన్న ప్రభుత్వ సాయాన్ని పెంచారు. అలానే ఇమామ్, మౌజమ్, ఫాస్టర్లకు గౌరవ వేతనాలు పెంపు. వ్యవసాయం
 48. ఏళ్లతరబడి అపరిష్కృతంగా మిగిలిపోయిన రెవెన్యూ సమస్యల పరిష్కారం దిశగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ఇందులో భాగంగా కబ్జాలకు, దందాలకు, అవకతవకలకు విరుగుడుగా పక్కాగా భూమిమీద నిజమైన హక్కుదారుడుకి న్యాయం జరిగేలా ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ – 2019 బిల్లును శాసనసభలో ఆమోదించారు.
 49. దీంతో పాటు భూ వివాదాలకు, ల్యాండ్‌ మాఫియాకు కళ్లెం వేస్తూ… రాష్ట్ర వ్యాప్తంగా భూముల సమగ్ర సర్వే, అత్యాధునిక విధానంలో రాష్ట్రం మొత్తమ్మీద సంపూర్ణంగా భూముల సర్వేకు నిర్ణయం తీసుకున్నారు.
 50. మరోవైపు రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పించే దిశగా … వ్యవసాయ మార్కెట్లను పటిష్టం చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ (వ్యవసాయ ఉత్పత్తులు–జీవధన) మార్కెట్‌ చట్టం సవరణ బిల్లును ఆమోదించారు.
 51. రెతులుకు మెరుగైన సేవలందించేందుకు వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో గౌరవ ఛైర్మన్లుగా స్ధానిక ఎమ్మెల్యేలను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
 52. ఇంకోవైపు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాల్లో రైతులకు పెద్ద పీట వేసిన ప్రభుత్వం… ప్రతీ రైతు కుటుంబానికి వైయస్‌ఆర్‌ రైతు భరోసా ద్వారా ఏటా ( ఈ ఏడాది అక్టోబరు నుంచే) రూ. 12500. విడతల వారీగా 50 వేల రూపాయల నగదు చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది.
 53. రైతన్నలకు సాగు పెట్టుబడి కోసం వడ్డీ లేని రుణాలును వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ పధకం కింద అమలకు శ్రీకారం చుట్టారు.
 54. సాగునీటి సమస్యను పరిష్కరించే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో రైతులకు ఉచితంగా 200 రిగ్గు బోర్లు వేయాలని నిర్ణయింయారు.
 55. వ్యవసాయానికి అన్నదాతలకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరాకు నిర్ణయం.
 56. ఆక్వా రైతులకు కరెంటు ఛార్జీలు యూనిట్‌కు రూ. 1.50కు తగ్గించారు.
 57. అత్యంత కీలకమైన గిట్టుబాటు ధర కోసం మునుపెన్నడూ లేని రీతిలో గత ప్రభుత్వాలేవీ కనీసం ఆలోచన కూడా చేయని విధంగా ఏకంగా రూ. 3 వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటు.
 58. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్‌ టాక్స్‌ రద్దు చేస్తూ నిర్ణయం.
 59. ప్రమాదవశాత్తూ చనిపోయినా లేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి వైయస్‌ఆర్‌ బీమా ద్వారా రూ. 7 లక్షల నష్టపరిహారం చెలించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
 60. ప్రతీ నియోజకవర్గంలో శీతల గిడ్డంగులు – అవసరం మేరకు పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు నిర్ణయం.
 61. కీలకమైన కౌలురైతులకు సంబంధించి, భూ యాజమానుల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా కౌలు రైతులకు 11 నెల పంటమీద మీద మాత్రమే హక్కు ఉండేలా కౌలుదార్ల చట్టం. తద్వారా వైయస్‌ఆర్‌ రైతు భరోసాతో పాటు పంటల భీమా, పంటల పరిహారం అందించే చట్టం.
 62. వెయస్‌ఆర్‌ జలయజ్ఞం ద్వారా సకాలంలో ప్రాజెక్టులు పూర్తి. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నిర్ణయం. గోదావరి జలాలను నాగార్జున సాగర్, శ్రీశైలంకు తరలించడం ద్వారా కృష్ణా ఆయుకట్టును స్ధిరీకరిస్తూ రాయలసీమ, ప్రకాశం జిల్లా ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించేలా ప్రణాళిక.
 63. గత ప్రభుత్వ హయాంలో అధికారంలో ఉన్నవారికి, కాంట్రాక్టర్లకు ఏటీఎం మిషన్‌గా మారిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రీటెండరింగు… అవినీతి వెలికితీతే లక్ష్యంగా అడుగులు.
 64. రెతులను అదుకునేందుకు ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా వ్యవసాయ మిషన్‌ ఏర్పాటు.
 65. రైతు పండించే పంటలకు ప్రభుత్వమే భీమా చేయించి ప్రీమియం చెల్లించేలా వైయస్‌ఆర్‌ ఉచిత భీమా పధకం.
 66. 2018 ఖరీఫ్‌లో కరువుకు సంబంధించి రైతులకు గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ. 2000 కోట్ల ఇన్‌ పుట్‌ సబ్సిడీ విడుదల.
 67. ధాన్యం సేకరణకు గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ. 960 కోట్లు చెల్లించడానికి చర్యలు. రూ. 360 కోట్లు విడుదల.
 68. కష్టాల్లో ఉన్న శనగరైతులను ఆదుకునేందుకు క్వింటాల్‌కు రూ.1500 చొప్పున రూ. 300 కోట్లు బోనస్‌గా విడుదల.
 69. ఆయిల్‌ ఫామ్‌ రైతులకు అదనపు మద్ధతు ధర కోసం రూ.80 కోట్లు విడుదల.
 70. నాఫెడ్‌ ఏర్పాటు చేసిన 5 కొనుగోలు కేంద్రాల ద్వారా కొబ్బరికి కనీస మద్ధతు ధర కోసం చర్యలు.
 71. తొలి ఏడాదే సహకార రంగ పునరుద్ధరణకు చర్యలు.
 72. గత ప్రభుత్వం విత్తన బకాయిలకు సంబంధించిన రూ.384 కోట్లు ఇచ్చేందుకు చర్యలు.
 73. ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధిగా బడ్జెట్‌లో రూ. 2000 కోట్లు.
 74. వరదలు, భారీ వర్షాలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన పంటలకు ప్రభుత్వం ఇస్తున్న పరిహారానికి అదనంగా 15 శాతం ఇన్‌పుట్‌ సబ్సిడీ.
 75. పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రం ఏర్పాటు.
 76. కొబ్బరి తోటల సాగును ఉపాధి హామీ పధకంతో అనుసంధానం చేస్తూ ప్రభుత్వ నిర్ణయంతో కొబ్బరి రైతులకు మేలు..
 77. కొబ్బరికి మరింత చేయూతనిచ్చే దిశగా సెంట్రల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీపీఆర్‌ఐ) ఆద్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం.
 78. ఆన్‌ ఫామ్‌ రీసెర్ట్‌ స్టేషన్‌ అంటే రైతుల పొలంలోనే శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టే విధానాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం.
 79. కొబ్బరి ధరలకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా నాఫెడ్‌ సహకారంతో తూర్పుగోదావరి జిల్లాలో 5 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుతో పాటు కొనుగోలు కేంద్రాల్లో మార్కెట్‌ సెస్‌ రద్దు చేస్తూ నిర్ణయం. ఫలితంగా గతంలో క్వింటాళు కొబ్బరి ధర రూ. 6 వేలు పలకగా… ఇప్పుడు రూ.8500 వేలకు పెరిగింది.
 80. వెయస్సాస్‌ ఉచిత పంటల బీమా కింద కొబ్బరి పంటల బీమా ప్రీమియమ్‌లో 75శాతం మొత్తాన్ని కొబ్బరి బోర్డుతో కలిసి ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం.
 81. కొబ్బరి సాగును ఉపాధి హామీ పధకంతో అనుసంధానం చేస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. గత ప్రభుత్వాలకు దీనిమీద శ్రద్ధలేకపోవడం వల్ల రైతులు న ష్టపోయారని… ప్రస్తుత ప్రభుత్వం హయాంలో ఉపాధి హామీని అనుసంధానం చేయడం వల్ల ఒక హెక్టారు(2.5ఎకరాలు)కు రూ.2,79,770 మూడేళ్లలో ఉపాధి హామీ పధకం కింద ఇవ్వాలని నిర్ణయం. దీంట్లో వేజ్‌ కాంపోనెంట్‌(కూలీ చెల్లింపు) కింద 822 పనిదినాలు లెక్కించి రూ.1,73,591, మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద రూ.1,06,179 చెల్లిస్తారు. అంటే రైతులకు తొలి ఏడాది దాదాపు రూ.1.08 లక్షలు, రెండో ఏడాది రూ.85వేలు, మూడో ఏడాది రూ.52వేల అందిస్తారు.

చట్టాలు – విధానాలు

 1. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి గారు తన మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 60 శాతం పదవులు ఇచ్చి ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే నవశకానికి శ్రీకారం చుట్టారు. ఇందులో ఆ వర్గాల నుంచి ముగ్గురికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు.
 2. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం.
 3. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం.
 4. శాశ్వత ప్రాతిపదికన రాష్ట్రంలో బీసీ కమిషన్‌ ఏర్పాటు చేస్తూ చట్టం.
 5. ప్రభుత్వ నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం.
 6. ప్రభుత్వ నామినేటెడ్‌ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం.
 7. పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తూ బిల్లు.
 8. దశలవారీగా మద్య నిషేధం దిశగా.. మద్య నియంత్రణ చట్ట సవరణ.
 9. రాష్ట్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం షాపుల నిర్వహణకు శ్రీకారం.. బెల్టు షాపులు పూర్తిగా ఎత్తివేత.. తగ్గిన మద్యం వినియోగం.
 10. ఇక ప్రభుత్వ హయాంలోనే మద్యం దుకాణాల నిర్వహణ. మద్యం దుకాణాల్లో 16 వేల ఉద్యోగాలు.
 11. ఆలయ పాలక మండళ్ళలో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు.
 12. రాష్ట్రంలో పారదర్శకతకు పట్టం కడుతూ రూ.100 కోట్లు దాటిన కాంట్రాక్టులన్నింటినీ జ్యుడీషియల్‌ ప్రివ్యూకు పంపేలా చట్టం.
 13. అవినీతి లేని సుపరిపాలన కోసం.. ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్త ఏర్పాటుకు ఆమోదం.
 14. విద్యా రంగంలో నవశకం– పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఏర్పాటు బిల్లు–2019కి శాసన సభ ఆమోదం.
 15. ఉన్నత విద్యా సంస్థల్లో ఉన్నత ప్రమాణాలు–అధిక ఫీజులకు కళ్ళెం వేస్తూ.. ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఏర్పాటు బిల్లు–2019కి శాసన సభ ఆమోదం.
 16. ఇక కబ్జాలకు, దందాలకు, అవకతవకలకు విరుగుడుగా పక్కాగా భూమిమీద హక్కు–ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌–2019 బిల్లుకు సభ ఆమోదం.
 17. భూ వివాదాలకు, ల్యాండ్‌ మాఫియాకు కళ్ళెం వేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా భూముల సమగ్ర సర్వే.. అత్యాధునిక విధానంలో రాష్ట్రమొత్తం సంపూర్ణంగా భూముల సర్వే.
 18. ఉద్దానం కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం– రూ. 600 కోట్లతో మంచినీటి పథకం.
 19. వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో గౌరవ ఛైర్మెన్లుగా స్థానిక ఎమ్మెల్యేలు.. విద్య
 20. జగనన్న అమ్మ ఒడి ద్వారా.. పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికీ సంవత్సరానికి రూ. 15,000. ఇంటర్‌ వరకూ పథకం వర్తింపు. జనవరి 26 నుంచి అమలు
 21. జగనన్న విద్యా దీవెన పథకం కింద..ప్రతి పేదవాడి పెద్ద చదువుకు అయ్యే ఖర్చు కోసం 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌.
 22. ఇంటర్మీడియేట్‌ అనంతరం ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు వసతి, భోజన ఖర్చుల కోసం ఏటా రూ. 20 వేలు.
 23. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఇంజినీరింగ్‌ కాలేజీల్లో.. స్కిల్‌ డెవలప్మెంట్ సెంటర్లు– మొత్తం 25 సెంటర్లు ఏర్పాటు.
 24. సాలూరులో ట్రైబల్‌ యూనివర్సిటీ, పాడేరులో ట్రైబల్‌ మెడికల్‌ కాలేజీ, కురుపాంలో ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటుకు నిర్ణయం..
 25. ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖల్ని దశలవారీగా మార్చి ప్రతి ప్రభుత్వ పాఠశాలకూ కాంపౌండ్‌ వాల్, సరైన టాయ్‌లెట్లు, మంచినీటి సదుపాయం, ఫర్నిచర్, బ్లాక్‌బోర్డ్, పాఠశాల భవనాలకు మరమ్మతులు, వాటకి పెయింట్లు వేయించటం వంటి చర్యలతో… పాఠశాలలన్నింటి రూపురేఖల్ని మార్చేందుకు బృహత్తర ప్రణాళిక.
 26. ఉద్యోగాలకు ఉపయోగపడేలా చదువుల ప్రణాళికను మార్చాలని నిర్ణయం. ప్రతి స్కూల్‌లో ఇంగ్లీష్‌ మీడియం. సబ్జెక్టుగా తెలుగు తప్పనిసరి.
 27. విద్యార్థుల మానసిక ఉల్లాసానికి.. నో బ్యాగ్‌ డే

ఆరోగ్యం

 1. ప్రపంచంలోనే రోల్‌ మోడల్‌గా డాక్టర్‌ వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ– రూ. 1000 బిల్లు దాటినట్టయితే, వార్షిక ఆదాయం రూ. 5 లక్షలు లోపు ఉన్న అన్ని వర్గాల వారికీ, 2031 జబ్బులకు ఎన్ని లక్షలు ఖర్చు అయినా ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా ఉచిత వైద్యం. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలలో చికిత్స చేయించుకున్నా ఆరోగ్యశ్రీ వర్తింపు.
 2. కిడ్నీ బాధితులకు నెలకు రూ. 10 వేలు పింఛను. తలసీమియా, పక్షవాతం, మస్కులర్‌ డిస్ట్రాఫీ వంటి వ్యాధులకు గురైన బాధితులకు పింఛన్లు ఇచ్చే పథకంపై సమాలోచనలు.
 3. అధునాతన సౌకర్యాలతో 108, 104 అంబులెన్స్‌లు.. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం
 4. గిరిజన తండాల్లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్ల జీతాలు రూ. 400 నుంచి రూ. 4000కు పెంపు
 5. రెండేళ్ళలోగా కార్పొరేట్‌ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వాసుపత్రులన్నీ తీర్చిదిద్దేందుకు చర్యలు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల రూపు రేఖల్ని, వాటిలో సదుపాయాల్ని తీర్దిదిద్దటం. బడ్జెట్‌లో రూ.1500 కోట్లు కేటాయింపు
 6. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, చుట్టుపక్కల గ్రామాల కిడ్నీ బాధితుల కోసం.. 200 పడకలతో కిడ్నీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు ఉత్తర్వులు(రూ. 50 కోట్లు తక్షణ కేటాయింపు)
 7. డాక్టర్‌ వైయస్‌ఆర్‌ కంటి వెలుగు(అక్టోబరు 10, 2019 నుంచి అమలు) కార్యక్రమం.. కింద ఉచితంగా కంటి పరీక్షలు..
 8. రాష్ట్రంలోని 7 ఐటీడీఏల్లో(గిరిజన ప్రాంతాలు) సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటుకు నిర్ణయం.
 9. విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, కర్నూలు, కడపలో కాన్సర్‌ హస్పిటల్స్‌ ఏర్పాటు
 10. శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో కిడ్నీ హస్పిటల్స్‌
 11. పాడేరు, విజయనగరం, పల్నాడులో మెడికల్‌ కాలేజీల ఏర్పాటు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *