ఆరోగ్యశ్రీ మీద ఏపీ సీఎం కీలక నిర్ణయాలు

ఈరోజు సచివాలంలో వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కడప, విశాఖ, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో క్యాన్సర్ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలలో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ రీసెర్చ్ ఆసుపత్రులను, పాడేరు, విజయనగరం, గురజాలలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని జగన్ అధికారులకు సూచించారు. అలాగే 108, 104 వాహనాలు ఎప్పుడూ మంచి కండిషన్‌లో ఉండేలా చూడాలని కనీసం ఆరు సంవత్సరాలకు ఒకసారయినా వాహనాలను మార్చాలి. వేయి వాహనాలను ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

అలాగే అర్హులైన ప్రతి కుటుంబానికీ హెల్త్‌ కార్డు, క్యూఆర్‌ కోడ్‌తో కార్డుల జారీచేయాలని, ఆ కార్డులో ఎప్పటికప్పుడు కుటుంబ ఆరోగ్య వివరాలను పొందుపరచాలని డిసెంబర్ 21 నుండి హెల్త్ కార్డులను జారీచేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. అక్టోబర్ 10 నుండి వైఎస్ఆర్ కంటివెలుగు పథకాన్ని ప్రారంభించనున్నామని, ఈ పధకం ద్వారా ఉచితంగా పరీక్షలు చేసి అవసరం అయిన వారికి ఆపరేషన్లు, కంటి అద్దాలు అమర్చాల్సిన వారికి కంటి అద్దాల పంపిణీ చేపడతామని అన్నారు. ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి ఆరోగ్యశ్రీ వర్తించాలని, వైద్య ఖర్చు వెయ్యి దాటితే ఆ ఖర్చును ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తామని అన్నారు.

జనవరి 1 నుండి పశ్చిమగోదావరి జిల్లా నుండి పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించి మూడు నెలల పాటు అధ్యయనం చేసి అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తేవాలని నిర్ణయించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో 150 ఆసుపత్రులలో కూడా ఆరోగ్యశ్రీ వర్తించేలా చేయాలనీ, నవంబర్ మొదటి వారం నుండి ఇది అమల్లోకి తేవాలని.. జాబితాలో చేరే వ్యాధులతో లిస్ట్ తయారుచేయాలని ఆదేశించారు. రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికీ ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని, ఆరోగ్య శ్రీ ద్వారా సుమారు సుమారు కోటిన్నర మందికి లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తున్నామని జగన్ పేర్కొన్నారు. అలాగే ఆరోగ్యశ్రీలో ఉన్న ఆసుపత్రులను ఏ,బీ,సి జాబితాలుగా చేసి సి కేటగిరీలోని ఆసుపత్రులను తొలగించి, లోపలున్న ఆసుపత్రులను బీ కేటగిరీలోకి తెచ్చి పరిశీలించాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *