YS Jagan: వాహనదారులకు జగన్ షాక్.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

ఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాట్ రూ.1.24 వరకు పెంచేసింది. దీంతో వాహనదారులపై ప్రభావం పడనుంది.

ప్రధానాంశాలు:

1.పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంపు
2.రూ.1.24 వరకు పెరుగుదల
3.దీంతో వాహనదారులపై ఎఫెక్ట్

ఆంధ్రప్రదేశ్ వాహనదారులకు ముఖ్యమైన అలర్ట్. జగన్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

నిధుల కొరత నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్‌పై పన్ను వ్యవస్థను సవరించింది.

పెట్రోల్‌పై వ్యాట్ రూ.1.24, డీజిల్‌పై వ్యాట్‌ను 93 పైసలు చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి అదనంగా రూ.600 కోట్లు సమకూరనున్నాయి.

ఆంధ్రప్రదేశ్ వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ చట్టం 2005ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డర్‌ను జారీ చేసింది.

దీని ప్రకారం.. సవరించిన రేట్లను గమనిస్తే.. లీటరు పెట్రోల్‌పై 31 శాతం పన్ను, రూ.4 అదనపు సుంకం కట్టాలి.

లీటరు డీజిల్‌పై 22.25 శాతం పన్ను, రూ.4 అదనపు సుంకం చెల్లించాలి.

కోవిడ్ 19 లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిన విషయం తెలిసిందే.

2020 ఏప్రిల్‌లో రాష్ట్ర ఆదాయం రూ.1323 కోట్లకు పడిపోయింది. 2019 ఏప్రిల్ నెలలో రాష్ట్ర రాష్ట్ర ఆదాయం రూ.4480 కోట్లుగా ఉంది.

మే, జూన్ నెలల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి తప్పనిసరి పరిస్థితుల్లో పన్ను వ్యవస్థను సవరించామని స్పెషల్ చీఫ్ సెక్రటరీ (రెవెన్యూ) రజత్ భార్గవ తెలిపారు.

ఇకపోతే కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా ఇప్పటికే చాలా రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల ఆదాయం తగ్గిపోవడం ఇందుకు ప్రధాన కారణం. కోవిడ్ 19 వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. చాలా మంది ఉపాధి కూడా కోల్పోతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *