టీడీపీకీ కౌంటర్ గా త్వరలో బీసీ గర్జన ఏర్పాటు చేయాలని నిర్ణయించింది వైసీపీ*

వైసీపీ అధ్యక్షుడు జగన్ బీసీ నేతలతో భేటీ అయి చర్చిస్తున్నారు.

ఫిబ్రవరి మూడో వారంలో బీసీ గర్జన నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అయితే సభను ఎక్కడ నిర్వహించాలి అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సభ్యులు, బీసీ నేతలు, బీసీ అధ్యయన కమిటీ దాదాపు ఆరు నెలల నుంచి కూడా 13 జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ అధ్యయన కమిటీ టూర్ చేసింది.

ఆ టూర్ లో భాగంగా కొన్ని అంశాలను వారు తెరపైకి తీసుకు వస్తున్నారు.

బీసీలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎలాంటి న్యాయం చేయాలి అనే అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు.

రాజకీయాల్లో బీసీలకు ఎలాంటి సీట్లు ఇవ్వాలి అంశాల ఆధారంగా కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిర్ణయించుకుంటామని చెప్పారు.

నిన్న రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన జయహోబీసీ కార్యక్రమంకీ పోటీగా…

అలాగే బీసీలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దానికి సంబంధించి చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు.

దాదాపు 20 మందికి పైగా సభ్యులతో పాటు బోత్స సత్యనారాయణ బీసీ సంఘ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి ,

అనేకమంది 13 జిల్లాల నుంచి సంబంధించిన లీడర్లు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.

అందులో భాగంగానే మొదట బీసీ అధ్యయన కమిటీ సమావేశం జరిగింది.

జగన్మోహన్ రెడ్డి తో కీలక నేతలంతా భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నా తర్వాతే 13 జిల్లాల నుంచి వచ్చిన నేతలతో ఇప్పటికే సమావేశమయ్యారు. ఇప్పటికే నివేదిక తయారు చేసిన సందర్భంలో ఆ నివేదికను జగన్మోహన్రెడ్డికి సమర్పించే పరిస్థితి కూడా ఉంది.

ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతాన్ని ఎన్నుకున్నారు అది ఏలూరు అని అనుకున్నారు.

ఏలూరులో ఫిబ్రవరి 19వ తారీఖున బీసీ గర్జన సభ ఏర్పాటు చేయాల లేకపోతే వేరే ప్రాంతంలో ఏర్పాటు చేయాలా అన్న దానిపై చర్చించుకుంటున్నారు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి గారు ప్రకటించిన నవరత్నాలు ఏవైతే పార్టీ అజెండా ఉందో అందులో భాగంగా బీసీలకు ఎక్కువగా ఉపయోగపడే అనేక స్కీములు ఏర్పాటు చేశారు.

అమ్మ ఒడి, వైయస్సార్ ఆంధ్ర , వైయస్సార్ చేయూత , ఈ స్కీమును ద్వారా బీసీలకు ఉపయోగపడేలా చేస్తామన్నారు.

అందులో భాగంగా 45 సంవత్సరాలు నిండిన బీసీ మహిళలకు పెన్షన్ అందేలా చేస్తామన్నారు.

వీటితోపాటు 13 జిల్లాల్లో ఉండేటువంటి బీసీ సంఘాలను బలపరిచే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.

నిన్న తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన జయహో కార్యక్రమానికి పోటీగా జగన్ మోహన్ రెడ్డి బీసీలకు మరింత ఉన్నత స్థానాన్ని కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు బీసీ నేతలతో ఆయన భేటీ అయి సంకల్పించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *