పలువురిని విచారించిన ఎన్ఐఏ అధికారులు జగన్ పై దాడి కేసు విచారణ ముమ్మరం

వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పే దాడి కేసు విచారణ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు ముమ్మరం చేశారు. విశాఖలోని మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్ ఇంట్లో పలువురిని విచారించారు. ఎన్ఐఏ కార్యాలయంలో కాకుండా విజయప్రసాద్ ఇంటికి అధికారులు వెళ్లారు. ఏన్ఐయె డిఎస్పి వెంకటాద్రి. సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బృందం శనివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు విచారించింది.

విజయ్ ప్రసాద్, తైనాల విజయకుమార్, వైకాపా నేత కేకే రాజు, కరణం ధర్మశ్రీ, తిప్పల నాగిరెడ్డి, సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర, మజ్జి శ్రీనివాస్, కొండ రాజీవ్గాంధీ, సుధాకర్, చంద్రశేఖర్ రెడ్డి లతో విడివిడిగా మాట్లాడారు. దాడి వెనుక కుట్ర ఉందని విచారణ సందర్భంగా చెప్పినట్టు బయటకు వచ్చాక వారు తెలిపారు. అయితే వారు చెప్పిన విషయాలను నమోదు చేసుకున్న అధికారులు. వాటిపై సంతకాలు మాత్రం తీసుకోలేదు. విమానాశ్రయంలోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ ప్రసాదను కూడాఏన్ఐయె అధికారులు శుక్రవారం విచారించారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడి నడవలేక పోతున్నాడని సమాచారం ఇవ్వడంతో ఆయన ఇంటికి వెళ్లి విచారించారు. రెండు గంటల పాటు మాట్లాడారు. దాడి నిందితుడు శ్రీనివాసరావు స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండలం రాణి లంక లోను పరువుని వాంగ్మూలాలనుఏన్ఐయె అధికారులు నమోదు చేశారు. దాడి చేసిన సమయంలో నిందితుడు వద్ద లభించిన 11 పేజీల లేఖ రాసిన అతడి సోదరి విజయదుర్గను ఏన్ఐయే సీఐ మహబూబ్బాషా విచారించారు. శ్రీనివాస్ రావు లేకుండా ఎందుకు రాయించాడు. విజయదుర్గా లేఖ రాసింది అనే విషయాలపై ఆరా తీశారు. ఆమె నుంచి దస్తూరి సేకరించారు. లేఖను జిరాక్స్ తీయించిన జగన్ తో శ్రీనివాసరావు కలిసి ఉన్న ఫ్లెక్సీని వేయించిన జె.సుబ్రమణ్యం కూడా విచారించారు. వీరితోపాటు గ్రామానికి చెందిన గిడ్డి చైతన్య గుదే శ్రీనివాసరావు ఇసుక పట్ల ఈశ్వరరావు ల నుంచి వాంగ్మూలాలను తీసుకున్నారు. శ్రీనివాస కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు గృహ నిర్మాణము బ్యాంకుల్లో తీసుకున్న రుణం తదితర విషయాల పైన విచారిస్తున్నారు.

ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో శ్రీనివాస రావు కు సంబంధించిన క్రిమినల్ కేసులు వివరాలు, విశాఖపట్నం విమానాశ్రయం లో రెస్టారెంట్ లో చేరడానికి స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ఎన్నో సి కోసం అతను దరఖాస్తు చేసుకున్నాడు లేదా? అనే వివరాలు ఇవ్వాలని ఏన్ఐయే సిఐ మెహబూబా బాషా స్థానిక పోలీసులకు లేఖ ఇచ్చారు. మరోవైపు జగన్ పే దాడి కేసులో ఎన్ఐఏ అధికారులు న్యాయస్థానంలో దాఖలు చేసే పత్రాల కాపీలను తాము కూడా ఇప్పించాలని నిందితుల తరపున శనివారం విజయవాడ కోర్టులో మెమో దాఖలు చేశారు. దీంతో అతను సమాధానం చెప్పుకునే అవకాశం ఉంటుందని నాయకులు మట జయశంకర్ మెమోలో పేర్కొన్నారు.

దీనిపై తదుపరి ఉత్తర్వులు నిమిత్తం న్యాయమూర్తి ఈ నెల 23కు వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *