బ్రాహ్మణి స్టీల్స్ మూత పడేంత వరకూ నిద్రపోలేదు పచ్చ మీడియా

బ్రాహ్మణి స్టీల్స్ పై పుంఖాను పుంఖాలుగా అసత్య కథనాలు వండి వార్చి, బ్రాహ్మణి స్టీల్స్ మూత పడేంత వరకూ నిద్రపోలేదు పచ్చ మీడియా.

బ్రాహ్మణి స్టీల్స్ పై పుంఖాను పుంఖాలుగా అసత్య కథనాలు వండి వార్చి, బ్రాహ్మణి స్టీల్స్ మూత పడేంత వరకూ నిద్రపోలేదు పచ్చ మీడియా.

నిజాం పట్నం వాడ రేవు గురించి పేజీలకు పేజీలు, స్టోరీలకు స్టోరీలు అసత్యాలు ప్రచారం చేసి, కాంట్రాక్ట్ రద్దయ్యేంత వరకూ నిద్రపోలేదు పచ్చ మీడియా.

బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి బట్టలు చించుకొని లేనిపోని కథనాలు రాసి, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఒప్పందం రద్దయేంత వరకూ నిద్రపోలేదు పచ్చ మీడియా.

శంషాబాద్ సమీపాన టాటా నానో ప్లాంట్ పరిశీలనాధికారులను పచ్చ మాఫియాతో కొట్టించి, వారు గుజరాత్ పారిపోయేంత వరకూ నిద్రపోలేదు పచ్చ మీడియా.

కానీ నేడు..

PPA లపై పునహ్ సమీక్షలు చేస్తుంటే, ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలవాల్సిన పచ్చ మీడియా.. వద్దు వద్దు అభిరుద్ది ఆగిపోద్దని మొసలి కన్నీరు కారుస్తుంది.

పోలవరం నుంచి నవయుగ ని తప్పిస్తే, వాస్తవాలేంటో ప్రజలకు చెప్పకుండా తమ కమీషన్ లు ఆగిపోతాయని, తీసుకున్న ముడుపులు తిరిగి ఇచ్చేయాల్సి వస్తుందని నవయుగ కోసం మాత్రమే పోరాడుతుంది పచ్చ మీడియా.

రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తుంటే అభినందించాల్సింది పోయి, తక్కువకి టెండర్ వేస్తే జనాల్లో పరువు పోతుందని, ఎక్కువకి టెండర్ వేస్తే కాంట్రాక్ట్ తమ వారికి దక్కదని అక్కసుతో పిచ్చి కూతలు కూస్తుంది పచ్చ మీడియా.

అదండి సంగతీ రెండువైపులా చూశారు కదా..

పక్కోడు అధికారంలో ఉంటే ఒకలా,తనవాడు అధికారంలో ఉంటే ఇంకోలా ఎలా కలాన్ని వాడుకుంటుందో పచ్చమీడియా!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *