వైసీపీ కాదంది.. జనసేన రమ్మంది.. ఆయన దారెటో?యలమంచిలి రవి

వైసీపీ నుంచి టికెట్ ఆశించినా దక్కలేదు.. జనసేన నుంచి సీటు ఇస్తాం రమ్మని పిలిచారు. పార్టీలొద్దు స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయడమే ముద్దు అంటున్న సీనియర్ నేత.

1.విజయవాడ తూర్పు టికెట్ ఆశించిన యలమంచిలి రవి
2.175మంది అభ్యర్థుల జాబితాాలో ఛాన్స్ ఇవ్వని జగన్
3.అనుచరులతో చర్చించి స్వంతంత్ర అభ్యర్థిగా బరిలోకి?

ఏపీలో ఎన్నికల హీట్ పెరుగుతోంది. ప్రధాన పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటిస్తుండటం.. టికెట్ ఆశించి దక్కని నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు.

కొందరు పక్క చూపులు చూస్తుంటే.. కొందరు మాత్రం రెబర్ అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.

భవిష్యత్‌లో న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా.. తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. పార్టీల్లో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతలకు కూడా టికెట్ దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది.

విజయవాడ తూర్పు నుంచి వైసీపీ టికెట్ ఆశించిన యలమంచిలి రవికి షాక్ తగిలింది. రవికి కాకుండా బొప్పన భవ్ కుమార్‌కు సీటు ఖాయం చేశారు. దీంతో యలమంచిలి రాజకీయ భవిష్యత్‌పై సందిగ్థత ఏర్పడింది.

యలమంచిలి రవి ఆదివారం తన అనుచరులు, సన్నిహితులతో సమావేశమయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించగా.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని అనుచరులు ఒత్తిడి తెచ్చారట.

ఇదే సమయంలో జనసేన తరపున టికెట్ కేటాయిస్తామని.. ఈనెల 21న నామినేషన్ చేయాలని జనసేన అధిష్టానం నుంచి ప్రతిపాదన వచ్చిందట. ఈ ఆఫర్‌ను రవి తిరస్కరించినట్లు తెలుస్తోంది.

చివరికి అనుచరుల ఒత్తిడి, వారి అభిప్రాయం మేరకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 22న నామినేష్ వేయడం ఖామయని అనుచరులు చెబుతున్నారు.

యలమంచిలి రవి 2009లో విజయవాడ నుంచి ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు.

2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి.. విజయవాడ తూర్పు టికెట్ ఆశించారు. కానీ అప్పటికే గద్దే రామ్మోహన్‌కు టికెట్ కేటాయించగా..

భవిష్యత్‌లో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పడంతో పార్టీ కోసం పనిచేశారు. గతేడాది అధిష్టానం తీరుపై అసంతృప్తితో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

తర్వాత అనుచరులతో సమావేశమై జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

విజయవాడ తూర్పు నుంచి రవి టికెట్ ఆశించగా.. స్థానిక సర్వే రిపోర్టు ఆధారంగా ఆ స్థానాన్ని బొప్పన భవ్ కుమార్‌కు కేటాయించారు. దీంతో రవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *