వైసిపీ, టీడీపీ, జనసేన తొలి జాబితాలు… నేడే రిలీజ్…

75 మంది తో వైసీపీ తొలి జాబితా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగి తన తొలి జాబితాను ఈరోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ప్రకటించాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ నిర్ణయించారు.
రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల జాబితాల కు కసరత్తుల్లో ఉండగా జగన్ మాత్రం తన అభ్యర్థులపై స్పష్టత ఇవ్వాలని భావిస్తున్నారు.

మంగళవారం హైదరాబాద్లో లోటస్ పాండ్ లో చర్చలు జరిపారు. లోక్ సభ అభ్యర్థులను కూడా ఈ రోజు ప్రకటిస్తారని తెలిసింది.
అసెంబ్లీకి సంబంధించి తొలి జాబితాలో 75 మంది పేర్లు ఉంటాయని తెలిసింది.
ఆ తర్వాత రోజుకు 25 మంది చొప్పున మరో మూడు రోజుల్లో మరి కొందరి పేర్లను రిలీజ్ చేయబోతున్నారు.
టైం ఎక్కువగా లేకపోవడంతో బస్సు యాత్రను రద్దు చేసుకున్న జగన్ హెలికాప్టర్లో పర్యటిస్తూ ప్రచారాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
టిడిపి తొలి జాబితాలో వందకు పైగా అభ్యర్థులు
టిడిపి అధినేత చంద్రబాబు వందకు పైగా అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసాడు ఆ జాబితాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
ఏప్రిల్ 11 అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో తో ప్రచారానికి కేవలం 28 రోజులు మాత్రమే ఉండడంతో గెలుపు గుర్రాలపై చంద్రబాబు.
జిల్లాల వారీగా అభ్యర్థులు ఎన్నికల్లో తలమునకలయ్యారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్ధుల బలాబలాల పై నేతలతో చర్చలు జరిపారు.

మొదటి జాబితాను ఫైనల్ చేసిన చంద్రబాబు మిగిలిన నియోజకవర్గాలపై కసరత్తు చేస్తున్నారు.
అసంతృప్తిని బుజ్జగిస్తూ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తొలి జాబితా ఇవాళ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
32 మంది తో జనసేన తొలి జాబితా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోటీలలో గట్టి పోటీ ఇవ్వాలని జనసేన తన అభ్యర్థులను సంబంధించిన జాబితాను సిద్ధం చేసింది.
పార్టీ జెనరల్ బాడీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసిన జనసేన 32 అసెంబ్లీ స్థానాలకు, తొమ్మిది లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేశారు.
తొలి జాబితా ఈరోజో రేపో విడుదల చేస్తారని తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత కోసం ఈ పార్టీ సరికొత్త పందాలు ఎంచుకున్నారట.

టిక్కెట్ల కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ అందరికీ స్వేచ్ఛ ఇచ్చారు పవన్ కళ్యాణ్.
పార్టీలో సీనియర్లు గా ఉన్న మాదాసు గంగాధరం, అర్హం ఖాన్, మహేందర్ రెడ్డి శివ శంకర్ హరి ప్రసాద్ వంటి నేతలతో కమిటీ ఏర్పాటు చేశారు.
ఈ కమిటీ విజయవాడ కార్యాలయంలో దరఖాస్తులను స్వీకరించి నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ఎంపిక చేస్తోంది.